Begin typing your search above and press return to search.

తెలుగు త‌మిళ హీరో స్ట్రెయిట్ మూవీ

By:  Tupaki Desk   |   2 Jan 2022 12:30 AM GMT
తెలుగు త‌మిళ హీరో స్ట్రెయిట్ మూవీ
X
మ‌న వాళ్లు బ‌హు భాషా చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. పేరుతో పాటు మార్కెట్ ని కూడా విస్తృతం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా త‌మ మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇదే ఫార్ములాని ఇప్పుడు త‌మిళ హీరోలు కూడా పాటిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అయితే మ‌న వాళ్ల‌కు భిన్నంగా త‌మిళ హీరోలు అడుగులు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌మ‌ళ హీరో ధ‌నుష్ ఒకే సారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా `సార్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తెలుగులో ధ‌నుస్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ ఫిల్మ్ ఇది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వైఫ్ సాయి సౌజ‌న్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఇదిలా వుంటే ధ‌నుష్ త‌ర‌హాలోనే మ‌రో త‌మిళ హీరో తెలుగు మార్కెట్ పై క‌న్నేశాడు. అత‌డే శివ కార్తికేయ‌న్‌. విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శివ కార్తికేయ‌న్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయ‌బోతున్నాడు.

ఈ చిత్రాన్నిరీసెంట్ గా `ల‌వ్ స్టోరీ` మూవీని నిర్మించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌ ఎల్ ఎల్ పీ అధినేత‌లు నారాయ‌ణ్ దాస్ కె నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు.. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు, శాంతి టాకీస్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని శ‌నివారం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చుశారు. ఈ చిత్రానికి `జాతిర‌త్నాలు` చిత్రంతో బ్లాక్ బ‌స్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

శివ కార్తికేయ‌న్ న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. #SK20 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించిన విజువ‌ల్స్ ని బ‌ట్టి పుదుచ్చేరి టు లండ‌న్ నేప‌థ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో న‌టీంచే హీరోయిన్‌, మిగ‌తా కీల‌క న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివ‌రాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది.