Begin typing your search above and press return to search.

మన రైటర్ల హవా బాగానే ఉందండీ

By:  Tupaki Desk   |   30 Aug 2015 1:46 PM IST
మన రైటర్ల హవా బాగానే ఉందండీ
X
మన స్టార్లు బాలీవుడ్‌ లో నటించి పేరు తెచ్చుకుంటున్న సందర్భాలున్నాయి. కెమెరామేన్‌ లు, ఎడిటర్‌ లు, సంగీత దర్శకులు ఇలా అన్ని విభాగాల నుంచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వాళ్లున్నారు. అయితే రచయితల నుంచి ఇంతకాలం బాలీవుడ్‌ కి వెళ్లి నిరూపించుకున్న ట్యాలెంట్‌ కనిపించలేదు.

ఇటీవలే భజరంగి భాయిజాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కి కథ ఇచ్చిన రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ బాలీవుడ్‌ లో పాపులర్‌ అయ్యారు. కోన వెంకట్‌ ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి రచయితగా పనిచేశారు. ఇప్పుడు అదే బాటలో గోపిమోహన్‌ కూడా బాలీవుడ్‌ సినిమాకి పనిచేయనున్నారని టాక్‌. సల్మాన్‌ ప్రస్తుతం కిక్‌ 2 కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి రచయితగా గోపిమోహన్‌ పని చేస్తున్నారుట.

అయితే బాలీవుడ్‌ కిక్‌2కి తెలుగు కిక్‌2కి ఏ సంబంధం లేదు. సల్మాన్‌ కిక్‌2 పూర్తిగా వేరు. అదో కొత్త స్క్రిప్టు కాబట్టి వక్కంతం నిరూపించుకుంటే ఇక ముంబైలో కింగ్‌ అవ్వొచ్చు. ఇక నుంచి వీళ్ల ఇన్‌ స్పిరేషన్‌ తో ఇతర రచయితలకు కూడా కొత్త అవకాశాలకు దారి దొరికినట్టే. వంశీ ఏం చేస్తాడో చూడాలి.