Begin typing your search above and press return to search.

తారల లుక్కులే దీపావళి టపాసులు

By:  Tupaki Desk   |   30 Oct 2016 7:30 AM GMT
తారల లుక్కులే దీపావళి టపాసులు
X
సినిమా రిలీజ్ కి.. ప్రీ రిలీజ్ కే కాదు.. ఇప్పుడు ప్రతీ పండక్కీ పలకరించడం సినిమావాళ్లకు బాగా అలవాటయిపోతోంది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతీ ఒక్కరు ప్రతీ పండక్కీ ఓ చిన్న గిఫ్ట్ ను ఫ్యాన్స్ కోసం వదులుతున్నారు. ఇప్పుడు దీపావళి సమయానికి సెట్స్ పై ఉన్న అనేక సినిమాలకు కొత్త లుక్ లు సందడి చేస్తున్నాయి.

ఈ హంగామా తారా స్థాయికి చేరిపోవడానికి కారణం అయితే మెగాస్టార్ చిరంజీవే. ఖైదీ నెంబర్ 150కి కొత్త లుక్ ఇచ్చారు చిరు. గతంలో ఇచ్చిన ఫస్ట్ లుక్ ఓ ఇంటెన్సిటీతో కూడిన లుక్ అయితే.. ఈ సారి డ్యాన్సింగ్ స్టిల్ తో పలకరించారు చిరు. బాలయ్య కూడా తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి కొత్త లుక్ ఇచ్చేశారు. యుద్ధ రంగంలో శతృవుపై కదం తొక్కుతున్న బాలకృష్ణ లుక్ అదిరిపోయిందంతే.

మరోవైపు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు చిత్రానికి కూడా ఫస్ట్ లుక్ వచ్చింది. తన శిష్యురాలిని బైక్ పై కూర్చోబెట్టుకుని సీరియస్ గా ఎక్కడికో వెళుతున్న గురు మనకు పోస్టర్లో కనిపిస్తాడు. ఇక మంచు మనోజ్ కూడా గుంటూరోడు గా తన లుక్ రివీల్ చేశాడు. కాసింత బరువు తగ్గి.. కొత్త లుక్ ట్రై చేసిన మనోజ్.. నోట్లో మిరపకాయ పెట్టుకుని గుంటూరు మిర్చి లాంటి కేరక్టర్ అని చెప్పకనే చెప్పాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/