Begin typing your search above and press return to search.
తెలుగు 'రామాయణం' సినిమాలు ఇవే
By: Tupaki Desk | 15 Jun 2023 9:39 PM ISTప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పోషించింది. ఈ రామాయణం సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రామాయణం ఇతివృత్తంతో పలు సినిమాలు వచ్చాయి. రామాయణం మొత్తం కథ గా తీసుకుని కొన్ని సినిమాలు వస్తే.. కొన్ని సినిమాలు మాత్రం రామాయణంలోని ముఖ్యమైన భాగాలతో రూపొందిన విషయం తెల్సిందే.
ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రాముని అరణ్యవాసం మరియు రావణుడితో యుద్దం ను మాత్రమే చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన రామాయణం సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా మాత్రం బాలకృష్ణ నటించి 'శ్రీరామరాజ్యం'
తెలుగు లో మొదటి రామాయణం నేపథ్యంలో సినిమా సంపూర్ణ రామాయణం 1958 లో రూపొందింది. కె సోము దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎన్టీఆర్ రాముడిగా పద్మిణీ జానకి పాత్రలో కనిపించింది. 200 రోజుల పాటు ఆడిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లు నమోదు చేసింది.
1961 లో హరనాథ్ మరియు గీతాంజలి జంటగా సీతారామ కళ్యాణం సినిమాను రామాయణం ఇతివృత్తం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికి కూడా బుల్లి తెరపై టెలికాస్ట్ అవుతోంది.
1963 లో ఎన్టీఆర్.. అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన లవకుశ సినిమా విడుదల అయ్యింది. మొదటి కలర్ రామాయణం సినిమాగా లవకుశ సినిమా నిలిచింది. ఆ సినిమాలో రాముడి పట్టాభిషేకం తర్వాత జరిగిన పరిణామాల గురించి చూపించడం జరిగింది.
1972 లో శోభన్ బాబు రాముడిగా చంద్రకళ సీత పాత్రలో రూపొందిన మరో సంపూర్ణ రామాయణం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ సినిమానే జనాలు రామాయణం అంటూ అమితంగా చూస్తున్నారు.. ఫాలో అవుతూ ఉన్నారు.
1978 లో ఎన్టీఆర్.. సంగీత సీతారాములుగా నటించిన 'శ్రీరామ పట్టాభిషేకం' సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఎన్టీఆర్ ను మరోసారి రాముడిగా చూపించి ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకు స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం.
1997 లో గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం వచ్చింది. అందరూ చిన్న పిల్లలే ఈ సినిమాలో. ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా లో రాముడిగా నటించాడు. అప్పుడే తాతకు తగ్గ మనవడు అనిపించుకుని రాముడి పాత్రను అద్భుతంగా పోషించాడు.
2011 సంవత్సరంలో బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్.. అంజలి ముఖ్య పాత్రలో నటించిన లవకుశ సినిమా కథనే తీసుకుని ఈ సినిమాను రూపొందించడం జరిగింది. రాముడిగా బాలయ్య కు మంచి మార్కులు దక్కాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆదిపురుష్ సినిమా తో రామాయణం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది.. గ్రాఫిక్స్ మాయాజాలం తో రామాయణం ను మరింత అందంగా చూపించారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.