Begin typing your search above and press return to search.

భార‌త టీవీ మూవీ కౌన్సిల్ లో తెలుగు నిర్మాత‌

By:  Tupaki Desk   |   15 Sep 2022 7:30 AM GMT
భార‌త టీవీ మూవీ కౌన్సిల్ లో తెలుగు నిర్మాత‌
X
ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (IFTPC) 31వ వార్షిక జనరల్ లో బాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై తీర్మానం జ‌రిగింది. ఈ స‌మావేశంలోనే సాజిద్ నడియాడ్ వాలా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (AGM) ప్ర‌కారం.. నదియాడ్ వాలా వరుసగా 11వ సంవత్సరం అధ్యక్షుడిగా ఎంపిక‌య్యారు. జమ్నాదాస్ మజేథియా కూడా చైర్మన్ గా మళ్లీ ఎన్నికయ్యారు. బోర్డ్ లో తెలుగు వాడైన మ‌ధు మంతెన కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. త్వ‌ర‌లో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి బాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై విన్న‌వించే టీమ్ లో అత‌డు ముఖ్య స‌భ్యుడిగా కొన‌సాగుతారు.

తాజా AGM స‌మావేశంలో ఇద్దరు కొత్త డైరెక్టర్లు .. కొత్త బోర్డుల ప్రవేశం గురించి చ‌ర్చ సాగింది. రతన్ జైన్ - NR పచిసియా- మధు మంతెన‌- శ్యామ్ బజాజ్ - కుమార్ మంగత్ పాఠక్ - రజత్ రావైల్ - శ్యామాషిస్ భట్టాచార్య-దినేష్ విజన్- నితిన్ వైద్య- అభిమన్యు సింగ్ - రమేష్ తౌరానీ త‌దిత‌రులు బోర్డ్ లో ఉన్నారు.

ఈ స‌మావేశంలో మహమ్మారి అనంత‌ర ప‌రిణామాల‌పైనా చ‌ర్చ సాగ‌గా.. ఇది తగ్గుముఖం పట్టిందని అధ్య‌క్షుడు నదియాడ్ వాలా సంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ బిజినెస్ మరోసారి జోరందుకుంటోంద‌ని ఆయ‌న అన్నారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వద్దకు వెళ్లే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తాన‌ని ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు విన్న‌విస్తామ‌ని తెలిపారు. బాలీవుడ్ కి సంబంధించిన ఆందోళనలను చర్చించడానికి ఇత‌ర స‌భ్యులు నదియాడ్ వాలాతో ఏకీభవించారు. టీవీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోంది. సినిమా రంగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పరిష్కరించాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిపై సమావేశం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సహాయం చేస్తామన్నారు. ప‌రిశ్ర‌మ‌కు విద్యుత్ ఖ‌ర్చు అధికమైంది. ప్ర‌భుత్వాలు అత్యంత అధిక విద్యుత్ ధరలను వ‌సూలు చేస్తున్నాయి. వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన వాపోయారు. ఆర్ట్ డైరెక్టర్లతో ఒప్పంద చ‌ర్చ‌లు సాగాల‌ని ఆయన అన్నారు. కొంత మంది ఆర్ట్ డైరెక్టర్లు స‌కాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడంలో విఫలమైనందున అద‌న‌పు భారం పెరుగుతోంద‌ని ఆందోళన వ్య‌క్త‌మైంది.

కార్మిక భ‌త్యాల‌పైనా ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. ఉద్యోగుల జీతాలు సకాలంలో అందాలి. కుద‌ర‌క‌పోతే ఇది వారి మధ్య అశాంతిని ఉద్రిక్తతను కలిగిస్తుందని అన్నారు. అలాగే ఈ ఏడాదిలో మరణించిన వారందరికీ సమావేశం నివాళులర్పించింది. గాన కోకిల‌ లతా మంగేష్కర్ - IFTPC మాజీ డైరెక్టర్ విజయ్ గలానీ సహా అంద‌రికీ నివాళుల‌ర్పించారు.

ఎటు చూసినా తెలుగు ప్ర‌తిభ‌దే హ‌వా.. మ‌ధు మంతెన తెలుగు వాడు.. ప‌క్కా హైద‌రాబాదీ. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కి స‌న్నిహితుడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి అమీర్ ఖాన్ తో గ‌జిని హిందీ రీమేక్ ని విజ‌య‌వంతం చేసారు. ఆ సినిమా మొద‌లు చాలా సినిమాల‌కు క‌లిసి పెట్టుబ‌డులు పెట్టారు. ప్ర‌స్తుతం అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క బ‌హుభాషా సిరీస్ 'మ‌హాభార‌తం' కి వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. త‌దుప‌రి రామాయ‌ణం 3డి పైనా క‌స‌ర‌త్తు కొన‌సాగిస్తున్నారు. అత్యంత భారీ ప్రాజెక్టులు చేస్తున్న వారిలో మ‌ధు మంతెన ఒక‌రు. ఆయ‌న భార‌త టీవీ మూవీ కౌన్సిల్ లో స‌భ్యుడిగా కొన‌సాగ‌డం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు గ‌ర్వ‌కార‌ణం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.