Begin typing your search above and press return to search.

కామెంట్: ఎందుకండీ ఈ టార్చర్ మాకు?

By:  Tupaki Desk   |   16 Sept 2016 11:00 PM IST
కామెంట్: ఎందుకండీ ఈ టార్చర్ మాకు?
X
ఒకప్పుడు సినిమాలు తీయడం అంటే.. నాలుగు ఎమోషనల్ సీన్లు, రెండు సెంటిమెంట్ సీన్లు - మూడు ఫైట్లు - ఆరు పాటలు అన్నట్లు ఉండేది. కాని ఇప్పుడు పద్దతి మారిపోయింది. సినిమాల్లో కంటెంట్ చాలా కొత్తగా ఉంటే కాని జనాలు చూడట్లేదు. పాటలు లేకపోయినా కామెడీ బిట్లు లేకపోయినా సినిమాలు ఆడేస్తున్నాయి. అందుకు కారణం కంటెంట్ కొత్తగా ఉండటమే.

అయితే ఇలాంటి సమయంలో కూడా ఇంకా ఔట్ డేటెడ్ ఐడియాలతో సినిమాలు తీస్తుంటే మాత్రం వారిని ఏమనాలో అర్దంకావట్లేదు. పెళ్ళిచూపులు రిలీజైన తరువాత తెలుగు ప్రేక్షకులను అలరించిన చిన్న సినిమా జ్యో అచ్చుతానంద. ఆ తరువాత ఇప్పుడు మరో రెండు సినిమాలు వచ్చాయి. కాని వాటిలో అసలు మ్యాటర్ లేకపోవడం అట్లా ఉంచితే.. ఇంకా 2000వ సంవత్సరం నాటి ఫ్యాక్షన్ కథలు.. లేదంటే ఇప్పటికే అందరం చూసేసిన హిందీ సినిమాను తీసుకుని దానికి తెలుగు డైలాగులు తగిలించి నేటివిటి మార్చడం చేతకాక మనల్ని టార్చర్ చేసే స్టోరీలు.. ఇవే తీస్తున్నారు.

చాలా కష్టపడి జోరును వర్షాలు కురుస్తున్నా కూడా గొడుగులు వేసుకుని మరీ ధియేటర్లకు వెళితే.. అక్కడ లోపల సదరు సినిమాలు పెట్టే టార్చర్ ఉంటుంది చూడండి.. దీని తస్సారవలా బడ్డూ.. జనాలకు పిచ్చెక్కిపోతోంది అంతే. ఎట్ ది సేమ్ టైమ్.. అసలు ఇంత డబ్బులు (కోట్లు) ఖర్చుపెట్టి ఇవేం రొటీన్ సినిమాలండీ బాబోయ్ అంటూ నిర్మాతలపై ప్రేక్షకులు జాలి కూడా చూపిస్తున్నారులే.