Begin typing your search above and press return to search.

మన ఏ ఒక్క సినిమాను వాళ్లు వదలడం లేదుగా

By:  Tupaki Desk   |   4 Oct 2020 7:30 PM IST
మన ఏ ఒక్క సినిమాను వాళ్లు వదలడం లేదుగా
X
ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమాలు దాదాపుగా అన్ని కూడా హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తక్కువ బడ్జెట్‌ తో వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డి నుండి మొదలుకుని మొన్నటికి మొన్న వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను కూడా హిందీలో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వచ్చిన కొన్ని రీమేక్‌ లు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రీమేక్‌ ల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా హిందీ లో డబ్‌ అయ్యి యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీమేక్‌ చేసే ఉద్దేశ్యంతో ఆ డబ్బింగ్‌ వర్షన్‌ ను తొలగించారంటూ సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాల నడుమ తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఇస్మార్ట్‌ శంకర్‌ కూడా జత కలిసినట్లయ్యింది. ఈ రీమేక్‌ లో రణ్‌ వీర్‌ సింగ్‌ నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ప్రముఖ దర్శకుడు ఈ రీమేక్‌ కు దర్శకత్వం వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ రెండు మూడు ఏళ్లుగా టాలీవుడ్‌ లో చిన్న బడ్జెట్‌ తో వచ్చి సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్న ఏ ఒక్క సినిమాను కూడా బాలీవుడ్‌ మేకర్స్‌ వదిలి పెట్టలేదు. చివరకు పూరి 'ఇస్మార్ట్ శంకర్‌' కూడా రీమేక్‌ కు రెడీ అయ్యింది.