Begin typing your search above and press return to search.

దసరా ఓవర్.. క్రిస్మస్ పై కన్నేశారు

By:  Tupaki Desk   |   14 Sep 2016 7:30 PM GMT
దసరా ఓవర్.. క్రిస్మస్ పై కన్నేశారు
X
ఈ సారి దసరా పండుగ టాలీవుడ్ కి మహా రంజుగా సాగనుంది. చాలా సినిమాలు ఇప్పటికే ఆ సీజన్ పై కన్నేశాయి. ఇప్పటికే 3-4 సినిమాలు దసరాలకు డేట్ అనౌన్స్ చేస్తే.. ఆ టైమ్ కే వచ్చేందుకు మరి కొన్ని మూవీస్ ప్రిపేర్ అయిపోతున్నాయి. ఈ దసరాలకు కనీసం అరడజన్ సినిమాలైతే సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

దసరా తర్వాత సహజంగా దీపావళిపై సినిమాలు కన్నేస్తాయ్ కానీ.. ఈసారి టపాసుల పండగ ఆదివారం వచ్చింది. అంటే వీకెండ్ పేరుతో ఇంకో రోజు ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదు. అందుకే ఈసారి సినిమాలన్నీ దీపావళిని కాకుండా క్రిస్మస్ ని టార్గెట్ చేసేశాయి. ఆ పండగ కూడా సండేనే వచ్చినా.. ఆ వారం మొత్తం హాలిడేస్ చాలామందికి ఉంటాయి. మొదటగా అయితే.. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ నటించిన ధృవని చెప్పుకోవాలి. డిసెంబర్ 2న ధృవ రిలీజ్ చేసేందుకు ఆలోచించినా.. ఇప్పుడు డిసెంబర్ 17కు గీతాఆర్ట్స్ లాక్ అయినట్లు టాక్.

నేచురల్ స్టార్ నాని-దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న నేను లోకల్ ను క్రిస్మస్ కే విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక వెంకటేష్ మొదలుపెట్టనున్న గురు మూవీని.. రెండే నెలల్లో పూర్తి చేసేసి.. డిసెంబర్ 19న విడుదల చేయాలని భావిస్తున్నారు. క్రిస్మస్ సీజన్ కి మూడు పెద్ద సినిమాలంటే.. ఆ సీజన్ కూడ ప్యాక్ అయిపోయినట్లే.