Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ కూడా టైటే గురూ!!

By:  Tupaki Desk   |   9 Aug 2016 5:30 PM GMT
సెప్టెంబర్ కూడా టైటే గురూ!!
X
అన్నీ అనుకున్నట్టు అయిపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటికి జనతా గ్యారేజ్ ప్రమోషన్లతో హోరెత్తించేవాడు. ఆ ముందో.. వెనకో ప్రేమమ్ అంటూ నాగ చైతన్య కూడా వచ్చేవాడే. జనతా గ్యారేజ్ ఫిక్స్ చేసుకొన్న సమయానికి రాలేదు.

చైతు కూడా మాంచి టైం కావాలంటూ ఆగిపోయాడు. ఈ ఇద్దరూ సెప్టెంబర్ కి షిఫ్ట్ అయిపోవడంతో వీళ్ల సినిమాలు నమ్ముకోని రిలీజ్ ఆపుకొన్న మూవీస్ కూడా సెప్టెంబర్ లోనే డేట్స్ లాక్ చేసుకొన్నాయ్. ఒకటి కాదు రెండు కాదు.. చూసే ఓపిక ఉండాలే కానీ వచ్చే నెల మొత్తం మూవీ లవర్స్ కి పండగే. గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత మరోటి వరసబెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయ్. జనతా గ్యారేజ్ తో మొదలుకానుంది అసలు సందడి. సెప్టెంబర్ 2న జూనియర్ ఎన్టీఆర్ మూవీ థియేటర్స్ లో ల్యాండ్ అవబోతుంటే.. ఇంకోకడ్ని అంటూ డబ్బింగ్ బొమ్మతో పలకరించడానికి విక్రమ్ కూడా అదే రోజు రాబోతున్నాడు. ఆ నెక్ట్స్ వీకే నాగ చైతన్య మచ్ అవెయిటెడ్ మూవీ ప్రేమమ్ రిలీజ్ ని ఫిక్స్ చేశారు. ఇక తమన్నా మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తోన్న అభినేత్రి.. సునీల్ ఈడు గోల్డ్ ఏహె కూడా సెప్టెంబర్ 9నే రిలీజ్ కాబోతున్నాయ్. పూరీ జగన్నాథ్- కళ్యాణ్ రామ్ ఇజమ్ సెప్టెంబర్ 29కి ఫిక్సైంది. ఆ తర్వాతి రోజే రామ్ హైపర్ విడుదల అవుతుందనే టాక్
వినిపిస్తోంది.

మధ్యలో 16, 23 డేట్లను వదిలేశారు. ఒకవేళ పోటీ ఎందుకని ఎవరైనా తగ్గి ఏవైనా అడ్జట్ మెంట్స్ జరిగితే ఈ టూ వీక్స్ కూడా బ్లాక్ అయిపోవచ్చు. ఎందుకంటే అక్టోబర్ లో మళ్లీ మెగా పవర్ స్టార్ రాబోతున్నాడు. దసరా హాలీడేస్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్ ధృవకి పోటీ వెళ్లే ధైర్యం ఎవరూ చేయరు. అందుకే వీలైనంత ముందు రావడానికే అందరూ ట్రై చేస్తుండటంతో సెప్టెంబర్ హౌస్ ఫుల్ అయిపోయింది.