Begin typing your search above and press return to search.
హాలీవుడ్ బాట పడుతున్న తెలుగు సినిమా..!
By: Tupaki Desk | 2 Jun 2021 9:00 AM ISTతెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ సినిమా. కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మూవీ. మన సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటడమే కాకుండా ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని పొందుతున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తూ.. అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపు చూసేలా చేస్తున్నారు మన మేకర్స్. ప్రతి స్టార్ హీరో కూడా తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో సినిమాలను రిలీజ్ చేసి మార్కెట్ విస్తరించుకుంటున్నారు.
పాండమిక్ పరిస్థితుల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో విశ్వాసంతో భారీ పాన్ ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్న టాలీవుడ్.. ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ క్రమంలో మనవాళ్ళ ఫోకస్ మెల్లగా హాలీవుడ్ వైపుకు ఫోకస్ మళ్లిస్తున్నారు. 'బాహుబలి' తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఐదు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే ఓ ఇంటర్నేషనల్ సినిమా చేయబోతున్నాడు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ తో భారతీయ కథను అంతర్జాతీయ స్థాయిలో చెప్పడానికి రెడీ అయ్యారు రాజమౌళి. ఈ మేరకు ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు కథను అందించనున్నారు. ఈ విషయాన్ని బాహుబలి రచయిత స్వయంగా వెల్లడించారు. ఇది ఇండియా నెటివీటిలో రూపొందే ఓ సూపర్ హీరో సినిమా అని టాక్ వినిపిస్తోంది.
ఇదే క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించే ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించనున్నారని తెలుస్తోంది. దీని కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు. ఇలా మనవాళ్ళు నెమ్మదిగా హాలీవుడ్ బాట పడుతున్నారని చెప్పవచ్చు.