Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి.. `చిట్టి ఫ‌రియా`కు మాస్ మ‌హారాజా ఆఫ‌ర్..!

By:  Tupaki Desk   |   14 March 2021 6:09 AM GMT
తెలుగ‌మ్మాయి.. `చిట్టి ఫ‌రియా`కు మాస్ మ‌హారాజా ఆఫ‌ర్..!
X
ఈవిడ ఏంటి ఇంత పొడ‌వు.. హీల్స్ ఏమైనా వేసిందా? అంటూ ఆరున్న‌ర అడుగుల ప్ర‌భాస్ అంత‌టివాడే కంగారు ప‌డ్డారు. డార్లింగునే మురిపించిన ఆ అచ్చ తెలుగు హైద‌రాబాదీ బ్యూటీ ఎవ‌రో చెప్పాల్సిన ప‌నే లేదు.

`జాతి రత్నాలు` ఫేం చిట్టి ఫరియా అబ్దుల్లా త‌న‌దైన‌ అందం చ‌క్క‌ని న‌వ్వు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటోంది. ఈ యూట్యూబర్ కం కాలేజ్ అమ్మాయి అనూహ్యంగా పెద్ద తెర‌పైకి దూసుకొచ్చింది. ద‌ర్శ‌కనిర్మాత‌ నాగ్ అశ్విన్ త‌న‌ని ఓ కాలేజ్ ఈవెంట్లో చూసి జాతిర‌త్నాలు చిత్రంలో ఆఫ‌ర్ ఇచ్చారు. న‌టించిన తొలి చిత్రంతోనే యువత‌ హృదయాలను గెలుచుకున్నారు. ఆర‌డుగుల బుల్లెట్టు లాంటి ఈ తెలుగు అందం టాలీవుడ్ లో వ‌రుస‌ ఆఫర్లను చేజిక్కించుకుంటోంది.

తాజా స‌మాచారం మేర‌కు మాస్ మ‌హారాజా రవితేజ కొత్త చిత్రానికి సంతకం చేయడానికి ఫ‌రియా సిద్ధమ‌వుతున్నార‌ట‌. క‌థానాయిక‌గా ఆఫ‌ర్ వ‌రించింద‌ని తెలిసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఇంకా ఈ ప్రాజెక్టుకు సంత‌కం చేయలేదు.

ఇంత‌కుముందు జాతిర‌త్నాలు సినిమా నుంచి రిలీజైన చిట్టి పాట‌తో ఫ‌రియా పేరు మార్మోగింది. ఆ వీడియో చూశాకే ర‌వితేజ నిర్మాత‌లు ఫ‌రియాకు ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలిసింది. చూస్తుంటే ఈ చిట్టి జాతిర‌త్నం నెమ్మ‌దిగా స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. త‌న హైట్ చూసి ఫ్లాటైపోయిన‌ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న‌కు ఏదైనా ఆఫ‌ర్ ఇస్తారేమో చూడాలి.