Begin typing your search above and press return to search.

కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న తెలుగు బ్యూటీ..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 12:30 AM GMT
కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న తెలుగు బ్యూటీ..!
X
స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి ఒకరు.. ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ యంగ్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ మాలీవుడ్ - కోలీవుడ్‌ లలో మాత్రం స్టార్ హీరోల పక్కన ఛాన్సులు దక్కించుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓ సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఇప్పుడు తెలుగులో కూడా ఓ స్టార్ హీరో సరసన నటంచే ఛాన్స్ కొట్టేసింది. అయితే అమ్మడు ఈ మధ్య ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.

ఈ బ్యూటీని ఓ యువ హీరో గ‌త కొద్ది రోజులుగా తెగ ఫాలో అవుతున్నాడ‌ట. ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమెను మెప్పించాడనికి తెగ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి ఆ కుర్ర హీరోకు మ‌ధ్య జ‌రిగే ప్రేమాయ‌ణ‌మే పేజ్ 3 ఫోక్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అయితే యంగ్ హీరో ఓ పెద్ద ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చాడ‌ని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవ‌రో తెలియాల్సి ఉంది. సినీ సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్స్ అనేది కామన్ గా జరిగే విషయమనేది తెలిసిందే. కాకపోతే చాలామంది జంటల ప్రేమాయణాలు పెళ్లి వరకు రాకుండానే బ్రేకప్ చెప్పుకుంటుంటారు. మరి ఈ లవ్ బర్డ్స్ మధ్య బంధం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.