Begin typing your search above and press return to search.
# RC15 తెలుగమ్మాయ్ కి పాన్ ఇండియా ఆఫర్
By: Tupaki Desk | 12 Aug 2021 12:58 PM ISTతెలుగు హీరోయిన్ అంజలి అలియాస్ సీతమ్మ దశాబ్ధకాలంగా కథానాయికగా కొనసాగుతున్నా ఇంకా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరలేకపోయింది. బిగ్ స్టార్స్ తో అవకాశాలు వస్తున్నా సెకెండ్ లీడ్ కే పరిమితవ్వాల్సి వస్తోంది. తమిళంలో ఏలినట్టు టాలీవుడ్ ని మాత్రం ఏలలేకపోయింది. కెరీర్ ఇప్పుడు అంతంతమాత్రమే. కనీసం ఇప్పటికి అయినా తమిళ్ భాషలో తప్ప తెలుగులో బిజీ నటిగా మారలేకపోయింది.
గతాన్ని పక్కనబెడితే వర్తమానంలో సీతమ్మకు బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని ఛేజిక్కించుకుంది. ఇది మెయిన్ లీడా రెండో లీడా? అన్నది పక్కన పెడితే జాతీయ స్థాయి పాపులారిటీ ఉన్న సినిమా కావడంతో అంజలికి జాక్ పాట్ తగిలినట్టేనన్న గుసగుస వినిపిస్తోంది.
రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 15వ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్రకు శంకర్ అంజలిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే అది సెకెండ్ హీరోయిన్ ఛాన్సా? లేక ఏమైదనా ముఖ్య పాత్రనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రధాన హీరోయిన్ గా ఇప్పటికే కియారా అద్వాణిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శంకర్ టీమ్ కొన్ని నెలలుగా తారాగణం ఎంపికలో బిజీగా ఉంది. ఎవ్వర్ లేటెస్ట్ గా అంజలిని కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అంజలికి ఇది కెరీర్ టర్న్ తిప్పే ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుత డిజిటల్ వరల్డ్ లో తనకు రేంజు పెరుగుతుంది. నటిగాను మరింత షైన్ అయ్యే అవకాశం ఉంటుంది.
పాన్ ఇండియా కంటెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి అన్ని భాషల్లోనూ రిలీజ్ అయితే అంజలికి అన్నిచోట్లా ఇమేజ్ పెరుగుతుంది. ఆ రకంగా తెలుగు నటి అంజలి పేరు అన్ని భాషల్లోనూ మోగుతుంది. ఇంకా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఏపాత్రకు ఎలాంటి నటీనటుల్ని ఎంపిక చేయాలి? అన్నదానిపై శంకర్ చాలా సీరియస్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే శంకర్ సినిమా ప్రారంభమవుతుంది.