Begin typing your search above and press return to search.

సూటేసి ఘాటు పెంచిన తెలుగందం!

By:  Tupaki Desk   |   16 Jun 2020 7:50 AM GMT
సూటేసి ఘాటు పెంచిన తెలుగందం!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా కనిపించడమే అరుదు.. అందులోను కొందరు మాత్రమే హీరోయిన్లుగా నెట్టుకొస్తున్నారు. ఒకవేళ హీరోయిన్లుగా మెరిసినా కొంతకాలం మాత్రమే.. మిగతా రాష్ట్రాల నుండి వస్తున్న హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీని యేళ్ళ తరబడి టాప్ పోసిషన్ లో ఊపేస్తున్నారు. అదే విధంగా తెలుగులో టాప్ యాక్టర్ అవుతుంది అనుకున్న తెలుగమ్మాయిలలో ఒకరు తేజస్వి మడివాడ. ఇతర బాషా హీరోయిన్లంత కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత గ్లామర్ గుప్పించడానికి అమ్మడు సిద్దంగానే ఉంది. సినీ యాక్టర్ గా కంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంట్రవర్సీ బ్యూటీగా ఎక్కువ పేరును సంపాదించుకుంది.

ఇక టాలీవుడ్ తెరపై ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో అడుగు పెట్టిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో హీరోయిన్ గా మారి మంచి నటన కనబరిచింది. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది కానీ హీరోయిన్గా మాత్రం వర్మ 'ఐస్ క్రీమ్‌' వరకే పరిమితం అయింది. ఇప్పటికి అదే ఆమె కెరీర్లో సోలో హీరోయిన్ గా పాపులర్ ఫిల్మ్. ఇక అమ్మడికి కాంట్రావర్సీలలో నిలవడం కూడా సరదానే అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ అవకాశం రాగానే టీవీ ప్రేక్షకుల అందరికి తేజస్వి బాగా దగ్గరైంది. బిగ్ బాస్ షోలో గొడవలతో పాటు వయ్యారాలు ఒలకబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ షో నుండి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుండి అమ్మడికి సినిమా ఆఫర్లు కరువయ్యాయి. అవకాశాలు వస్తాయో రావో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటోంది. వేడి పుట్టించే ఫోటోషూట్లతో తనలోని సోయగాలన్నీ బయటపెడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌ షేక్ చేస్తోంది. బ్రౌన్ కలర్ సూట్లో కూర్చున్న పోజు ఒకటి తాజాగా పోస్ట్ చేసింది. అంతే ఆ సూట్ లో కాస్త అమ్మడు లోదుస్తులు వేసుకోకుండా.. ఎద అందాలను ప్రదర్శనకు నిలిపింది. ఆ భంగిమలో తేజస్వి ఎద సంపద చూసి.. కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. బాబోయ్ ఈమె హీరోయిన్ గా కంటే ఇంస్టాగ్రామ్ బ్యూటీగానే సెగలు పుట్టిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.