Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : స్వారీకి సిద్దమైన అందాల దివి

By:  Tupaki Desk   |   4 Oct 2021 12:30 AM GMT
ఫొటోటాక్ : స్వారీకి సిద్దమైన అందాల దివి
X
తెలుగు బిగ్ బాస్ తో అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్న దివి వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. బిగ్‌ బాస్ కు ముందు దివి గురించి ఒక్కరికి ఇద్దరికి తెలిస్తే ఇప్పుడు వందలు వేల మందికి తెలుస్తోంది. ఆమెకు మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలు అయ్యింది. ఏ సమయంలో అయినా ఆ సినిమా చిత్రీకరణ లో దివి పాల్గొనబోతుంది. మరో వైపు వెబ్‌ సిరీస్ లు మరియు మీడియం సినిమాల్లో కూడా నటిస్తోంది. హీరోయిన్ గా వరుసగా నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తూ వస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు గుర్రం పక్కన చిన్న నెక్కర్‌ వేసుకుని బ్లూ షర్ట్‌ లో థైస్ ఎక్స్ పోజ్‌ చేస్తూ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోకు దివి అభిమానులు ఫిదా అవుతున్నారు. దివి పాప అందంతో అదరగొట్టేస్తోంది.. మా దివి బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసి పోవడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దివిని టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ శ్రద్దగా చూడాలని.. ఖచ్చితంగా ముంబయి ముద్దుగుమ్మలకు మించిన అందం ఆమె సొంతం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి దివి ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆమెను మరింతగా అభిమానిస్తున్నామని పేర్కొంటున్నారు. ఆకట్టుకునే రూపొంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న దివి నటిగా అవకాశాలు వస్తే తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఉంటుంది.

ఈమద్య కాలంలో వరుసగా హాట్ ఫొటో స్టిల్స్ ను షేర్‌ చేస్తున్న ఈ అమ్మడు మేకర్స్ ను దృష్టిని ఆకర్షించేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది. దివి తమిళ ఆఫర్ల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం వస్తే తమిళ ఇండస్ట్రీలో రాణించే సత్తా దివికి ఉంది. కనుక అక్కడ ఇక్కడ ఎక్కడైనా దివి ఖచ్చితంగా ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్ళకి అయినా కచ్చితంగా మంచి నటిగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉంది. దివి పాప ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా నటించే అవకాశాలు దక్కించుకుంటుందని నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.