Begin typing your search above and press return to search.

మేలో సినిమాల జాతరే..

By:  Tupaki Desk   |   25 April 2017 5:30 PM GMT
మేలో సినిమాల జాతరే..
X
కొత్త సినిమాలకు సమ్మర్ కంటే మంచి సీజన్ మరొకటి ఉండదు. ఈ సీజన్లో థియేటర్లకున్నంత ఆక్యుపెన్సీ మరే సీజన్లోనూ ఉండదు. అందుకే ఈ సీజన్లో భారీ సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. ఐతే ఈసారి ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి భారీ సినిమా వేసవి బరిలో ఉండటంతో అదొచ్చిన ఓ నెల రోజుల వరకు కొత్త సినిమాల సందడి మరీ ఎక్కువగా ఉండదని అనుకున్నారంతా. కానీ ‘బాహుబలి-2’కు భయపడకుండా మే నెలలో చాలా సినిమాల్ని షెడ్యూల్ చేసేశారు. సగటున వారానికి రెండు సినిమాల చొప్పున మే నెలలో షెడ్యూల్ అయి ఉండటం విశేషం.

మే నెలలో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షించే సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది మే 19న విడుదల కాబోతోంది. దీని తర్వాత నిఖిల్-సుధీర్ వర్మల ‘కేశవ’ జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ పెంచింది. ఈ చిత్రం మే 12న విడదులకు ముస్తాబవుతోంది. నాలుగు వరుస హిట్లతో ఊపుమీదున్న శర్వానంద్ సినిమా ‘రాధ’ కూడా 12కే వచ్చే అవకాశముంది. దీని కంటే ముందు.. బాహుబలి-2 వచ్చిన వారానికే అవసరాల శ్రీనివాస్ మూవీ ‘బాబు బాగా బిజీ’ షెడ్యూల్ అయి ఉంది.

ఇక రాజ్ తరుణ్ మూవీ ‘అంధగాడు’ మే 26న విడుదల కాబోతోంది. ఇది కాక గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ను కూడా మేలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది కాక కొత్తగా కృష్ణవంశీ మూవీ ‘నక్షత్రం’.. నాగ అన్వేష్-హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ‘ఏంజెల్’ కూడా మే పోటీకే తయారవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతాయో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/