Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో టాలీవుడ్ సత్తా గమనించారా!

By:  Tupaki Desk   |   24 Dec 2016 5:30 PM GMT
ఓవర్సీస్ లో టాలీవుడ్ సత్తా గమనించారా!
X

ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దంగల్ సెన్సేషన్స్ ఇప్పుడే మొదలయ్యాయి. యూఎస్ లో ఈ మూవీకి ప్రీమయర్స్ రూపంలో వచ్చి మొత్తం 2.82 లక్షల డాలర్లు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా రామ్ చరణ్ మూవీ ధృవకు ప్రీమియర్స్ రూపంలో 2.23 లక్షల డాలర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆమిర్ నటించిన దంగల్ లాంటి బాలీవుడ్ క్రేజియెస్ట్ మూవీకి.. టాలీవుడ్ ధృవకు మధ్య ప్రీమియర్ వసూళ్లలో అంతగా తేడా లేకపోవడం గమనించాలి. దంగల్ వీకెండ్ లో కాదు కదా అనే మాట రావచ్చు కానీ.. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ సినిమాలకు ఇది చాలా చిన్న కారణం అనాల్సిందే. నిజానికి ధృవ ప్రీమియర్స్ వచ్చిన వసూళ్లను మనం తక్కువ అనే చెప్పుకున్నాం. ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే.. టాలీవుడ్ లో దంగల్ కు రెండింతలు మూడు రెట్లకు పైగా ప్రీమియర్స్ రూపంలో వసూలు చేసిన సినిమాలున్నాయి.

మహేష్ మూవీ బ్రహ్మోత్సవంకు 5.56 లక్షల డాలర్లు రాగా.. పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కు 6.16 లక్షల డాలర్ల వసూళ్లు దక్కాయి. బాహుబలి ది బిగినింగ్ అయితే ఏకంగా 1.4 మిలియన్ డాలర్లు సాధించేసింది. యూఎస్ బాక్సాఫీస్ ని షేక్ చేయడంలో.. బాలీవుడ్ ని టాలీవుడ్ ఏ రేంజ్ లో ఔట్ పెర్ఫామ్ చేస్తోందో చూస్తుంటే.. తెలుగు సినిమాల సత్తా ఏంటో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/