Begin typing your search above and press return to search.

వైజాగ్ టాలీవుడ్.. ఫిలింస్టూడియోలు జ‌గ‌న్ దృష్టికి?

By:  Tupaki Desk   |   5 Jun 2020 3:00 PM IST
వైజాగ్ టాలీవుడ్.. ఫిలింస్టూడియోలు జ‌గ‌న్ దృష్టికి?
X
ప్ర‌త్యేక తెలంగాణ స‌ప‌రేట్ అయ్యాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి తొలి సీఎంగా బాల‌య్య వియ్యంకుడు చంద్ర‌బాబు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తేదేపా ఘ‌న‌విజ‌యం సాధించి ఏపీలో కుర్చీని ద‌క్కించుకుంది. కానీ ఏం లాభం? చంద్ర‌బాబు దృష్టి 24/7 డే అండ్ నైట్.. 365 రోజులూ అమ‌రావ‌తి రాజ‌ధాని ప్ర‌ణాళిక‌లు.. రియ‌ల్ వెంచ‌ర్ల‌పైనే నిలిచింది. ప‌ర్య‌వ‌సానంగా రెండోసారి ఎన్నిక‌ల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. అయితే చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్టాక వియ్యంకుడు బాల‌య్య‌కు వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటు లో భాగంగా.. విశాఖ‌ బీచ్ రోడ్ ప‌రిస‌రాల్లో ఐదెక‌రాల భూ కేటాయింపు ఉండ‌నుంద‌ని ప్ర‌చార‌మైంది.

వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ కి కూత‌వేటు దూరంలోనే బాల‌కృష్ణ కూడా ఫిలింస్టూడియోని నిర్మించేందుకు ముందుకొచ్చార‌ని స‌రిగ్గా రెండేళ్ల క్రితం ప్ర‌చార‌మైంది. ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎఫ్.డీసీ) సైతం ఈ విష‌యాన్ని అధికారికంగానే ప్ర‌క‌టించింది. బాబు జ‌మానాలో ఏపీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ అంబికాకృష్ణ హైద‌రాబాద్- అమ‌రావ‌తి మీడియాల‌కు దీనిపై ఓ ప్రెస్ నోట్ కూడా పంపించారు అప్ప‌ట్లో. చెన్న‌య్ ఏవీఎం స్టూడియోస్ స‌హా నంద‌మూరి బాల‌కృష్ణ వైజాగ్ లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి ఆస‌క్తిగా ఉన్నార‌న్న‌ది దాని సారాంశం.

క‌ట్ చేస్తే ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌మెంట్ మారింది. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసాధార‌ణ మెజారిటీతో విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక ఆ త‌ర్వాత ఎఫ్.డీ.సీ ఛైర్మ‌న్ కూడా మారారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ వైజాగ్ ఫిలింస్టూడియో ఏమైన‌ట్టు? ఏవీఎం ఫిలింస్టూడియో ద‌ర‌ఖాస్తు ఏమైన‌ట్టు? అప్ప‌ట్లో రెండు ద‌ర‌ఖాస్తులు ఏపీ ప్ర‌భుత్వానికి అందాయి క‌దా? బాల‌కృష్ణ‌ స్టూడియో నిర్మిస్తానంటే భూసంత‌ర్ప‌ణ చేసేందుకు బాబుకు ఓకే కానీ.. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఓకేనా? అస‌లు బాల‌య్య కొత్త సీఎంని ఏనాడైనా క‌లిశాడా? అంటే దేనికీ స‌రైన ఆన్స‌ర్ లేనే లేదు.

ఇక‌పోతే ప్ర‌స్తుతం రాజ‌కీయం మారింది. టాలీవుడ్ త‌ర‌పున సినీపెద్ద‌గా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి భేష‌జం లేకుండా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుస్తున్నారు. ప్ర‌తిదీ మాట్లాడుతున్నారు. జ‌గ‌న్ వైపు నుంచి రెస్పాన్స్ అంతే బావుంది. ఇక వైజాగ్ లో స‌రికొత్త టాలీవుడ్ ని నెల‌కొల్పేందుకు చిరంజీవి స‌హా సినీపెద్ద‌లు త‌న‌ని క‌లిస్తే వెంట‌నే ఓకే చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని.. ఏం కావాలో అడ‌గాల‌ని కూడా జ‌గ‌న్ అన్నారు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ స్వ‌యంగా మా డైరీ 2020 ఆవిష్క‌ర‌ణ‌లో వెల్ల‌డించారు. అంటే బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో మ‌రో టాలీవుడ్ కోసం భూములు ఇచ్చేందుకు వైకాపా ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంది. ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌దే ఆల‌స్యం. మ‌రి తాజా స‌న్నివేశంలో వైజాగ్ లో స్టూడియోలు క‌ట్టేందుకు చిరంజీవి .. బాల‌య్య స‌హా ఏవీఎం వాళ్లు వెళ‌తారా వెళ్లరా? అన్న‌ది సస్పెన్స్ గా మారింది. జూన్ 9న సీఎం జ‌గ‌న్ తో భేటీకి వెళుతున్నారు కాబ‌ట్టి అప్పుడేమైనా ఈ విష‌యం ప్ర‌స్థావ‌న‌కు వ‌స్తుందా? రాదా? అన్న‌ది వేచి చూడాలి. అలాగే ఈసారి భేటీలో జ‌గ‌న్ తో పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ని వైజాగ్ లో ఏర్పాటు చేసేలా మాట్లాడుతారేమో చూడాలి. తెలంగాణ‌లో ఇప్ప‌టికే దీనికి సంబంధించి కేసీఆర్- కేటీఆర్ ప్రామిస్ చేశారు. అలానే ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రామిస్ చేస్తారేమో చూడాలి.