Begin typing your search above and press return to search.

మార్నింగ్ షో తర్వాత అంతా.. మాయేనా?

By:  Tupaki Desk   |   3 Dec 2017 1:30 AM GMT
మార్నింగ్ షో తర్వాత అంతా.. మాయేనా?
X
ప్రస్తుతం టాలీవుడ్ చాలా అభివృద్ధి చెందుతోంది. ఇండస్ట్రీ మార్కెట్ కూడా చాలా విస్తరించింది. బాలీవుడ్ కి సమానంగా మన సినిమాలు సత్తాని చాటుతున్నాయి. కలెక్షన్స్ పరంగాను దేశంలో టాలీవుడ్ ఖ్యాతి ఈ పదేళ్లలో చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ డైలాగులు తెరవెనుక బాగా వినిపిస్తున్నాయి. కానీ కొన్ని సినిమాల పరిస్థితిని చూస్తుంటే టాలీవుడ్ అసలు డెవెలెప్ అయ్యిందా అనే అనుమానం కలుగుతోంది. రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత అసలు ఫస్ట్ షోకి ఒక్క ప్రేక్షకుడు కూడా రావడం లేదంటే చాలా దారుణమైన పరిస్థితి.

ఎంత చిన్న సినిమా అయినా ఆ మధ్య కాలంలో నాలుగైదు రోజుల వరకు థియేటర్స్ లో సందడి చేసేవి. కానీ ప్రస్తుత పరుగుల ప్రపంచంలో మొదటి ఆటకే సినిమాలు చతికిలపడుతున్నాయి. రీసెంట్ గా మెంటల్ మదిలో - దేవి శ్రీ ప్రసాద్ - లక్కీ అండ్ బాలకృష్ణుడు సినిమాలకు చాలా వరకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. రోజు మార్నింగ్ షో అనంతరం ఫస్ట్ షోకి కి ఖాళీ సీట్లు దర్శనం ఇస్తున్నాయి. ఈ సినిమాల్లో ఉన్నవారు ఎవరే తెలియని ముఖాలైతే కాదు. మరి ఈ పరిస్థితి వచ్చిందంటే అది సినిమాల లోపమా లేక తెలుగు ఇండస్ట్రీకి తగిలిన శాపమా?

శుక్రవారం వస్తే చాలు కుప్పలు కుప్పలుగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులోను మళ్లీ థియేటర్ల ఎంపికలో రాజకీయాలు గొడవలు. చివరికి రిలీజ్ చేస్తే.. ఎవడో ఒకడు పైరసి ప్రింటును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. టెక్నాలిజీ పెరుగుతున్న కొద్దీ చాలా మంది లాభపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలకు సంబందించి వారు ఉపయోగించినట్టుగా టెక్నాలిజీని ఎవరు ఉపయోగించరు. కానీ అదే టెక్నాలిజీ వల్ల వారికి ఇబ్బంది తప్పడం లేదు.

సినిమా థియేటర్స్ లో ఉంటూ ఫెస్ బుక్ లైవ్ ఇవ్వడం వాట్సాప్ లో షేర్ చెయ్యడం వంటి పరిణామాలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా ఇబ్బందులతో పలు సినిమాలు చాలా వరకు నష్టపోతున్నాయి. దీంతో థియేటర్స్ వరకు వచ్చే ఓపిక లేక కొందరు నెట్ లోనే సినిమాను చూసేస్తున్నారు. ఇక ఫ్యామిలీతో సినిమాకు వెళదామనుకుంటే జీఎస్టీ దెబ్బ మాములుగా ఉండడం లేదు. టిక్కెట్ రేట్లు గట్టిగానే పెరిగాయ్. సినిమాలకు ఇలాంటి దుస్థితి రావడానికి ఒక్క కారణం అని చెప్పలేము. చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదవుతోంది.

సినిమా ఎలా ఉన్నా అది తర్వాత సంగతి. కనీసం రెండు మూడు రోజులు అయినా మినిమమ్ కలెక్షన్స్ రాకుండా ఉండడం చాలా దారుణమైన పరిస్థితే. ఒకప్పుడు సినిమా ఎలా ఉన్నా మినిమమ్ 50 రోజుల వరకు సినిమా ఆడుతూనే ఉండేది. కానీ రాను రాను తెలుగు సినిమాల పరిస్థితి 50 - 100 రోజులు ఆడింది అనకుండా.. వారం ఆడితే 50 కోట్లు అంతకంటే ఎక్కువ రోజులు ఆడితే 100 కోట్లు అనే పరిస్థితికి వచ్చింది.