Begin typing your search above and press return to search.

ఈ ఆరు నెలల్లో టాలీవుడ్లో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   4 July 2017 9:37 AM GMT
ఈ ఆరు నెలల్లో టాలీవుడ్లో ఏం జరిగింది?
X
చూస్తండగానే అయిపోయాయి ఆరు నెలలు. ఈ ఆరు నెలల్లో తెలుగులో 50 సినిమాలకు పైనే వచ్చాయి. మరి వాటిలో ఎన్ని హిట్లొచ్చాయి అంటే రెండంకెల సంఖ్యలో కూడా లేవు. ఐతే టాలీవుడ్లో ఎప్పుడూ సక్సెస్ రేట్ 20 శాతం కూడా దాటదు కాబట్టి దీని గురించి బాధపడాల్సిన పని లేదు. నిజానికి గత కొన్నేళ్లతో పోలిస్తే.. ఈసారి సక్సెస్ రేట్ కొంచెం మెరుగ్గానేంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చింది ఈ ఆరు నెలల్లోనే. అదొక్కటి చాలు కొన్నేళ్ల పాటు చెప్పుకోవడానికి. దీన్ని పక్కన పెడితే.. టాలీవుడ్ కు మరిన్ని మంచి విజయాలు అందించింది 2017 ప్రథమార్ధం.

దీని తర్వాత కలెక్షన్ల పరంగా చూస్తే అతి పెద్ద విజయం ‘ఖైదీ నెంబర్ 150’. ఆ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి నాన్-బాహుబలి రికార్డుల్ని తుడిచి పెట్టేసింది. ఐతే పెట్టుబడి-రాబడి పరంగా చూస్తే మాత్రం ‘బాహుబలి-2’ తర్వాత బిగ్ బ్లాక్ బస్టర్ అంటే ‘శతమానం భవతి’ అనే చెప్పాలి. ఆ సినిమా పెట్టుబడి మీద మూడు రెట్లు వసూలు చేసింది. నాని సినిమా ‘నేను లోకల్’ కూడా ఇదే స్థాయిలో విజయం సాధించి.. బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. రానా సినిమా ‘ఘాజీ’.. వెంకటేష్ మూవీ ‘గురు’.. నాగచైతన్య చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా లాభాలు అందించి హిట్ కేటగిరిలో చేరింది.

ఇక ఈ ఆరు నెలల్లో హిట్ కేటగిరిలో చేరకపోయినా పర్వాలేదనిపించిన సినిమాలున్నాయి. రాజ్ తరుణ్ సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. నిఖిల్-సుధీర్ వర్మల ‘కేశవ’.. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అమీతుమీ’ యావరేజ్ కేటగిరిలో ఉన్నాయి. ‘దువ్వాడ జగన్నాథం’ కూడా ఈ కేటగిరిలోకే వేస్తుంది. ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టారు బయ్యర్లు. కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రావడం కష్టంగానే ఉంది. యుఎస్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలు మిగిల్చిందీ చిత్రం. ఓవరాల్ గా చూస్తే ‘డీజే’ను యావరేజ్ అనొచ్చేమో. డబ్బింగ్ సినిమాలు 16.. శివలింగ.. మరకతమణి కూడా ఓ మోస్తరు వసూళ్లతో యావరేజ్ అనిపించుకున్నాయి. ఇవి కాకుండా మిగతా సినిమాలన్నీ ఫెయిల్యూర్సే అని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/