Begin typing your search above and press return to search.

మీర్జాపూర్‌ 2 తెలుగు ఉద్దేశ్యం ఉందా? లేదా?

By:  Tupaki Desk   |   3 Nov 2020 6:10 AM GMT
మీర్జాపూర్‌ 2 తెలుగు ఉద్దేశ్యం ఉందా? లేదా?
X
ఇండియాలో వెబ్‌ సిరీస్‌ ల జోరు మీర్జాపూర్‌ తో ప్రారంభం అయ్యింది అనడంలో సందేహం లేదు. హిందీలో రూపొందిన ఆ వెబ్‌ సిరీస్‌ 2018లో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఇండియాలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినా కూడా మంచి రన్‌ టైంను దక్కించుకుంది. స్థానిక భాషల్లో కూడా డబ్‌ అయిన మీర్జా పూర్‌ దేశ వ్యాప్తంగా కూడా హిట్‌ అయ్యింది. దాంతో సీజన్‌ 2 ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు మీర్జాపూర్‌ 2 వస్తుందా అంటూ ఎదురు చూశారు. ఎట్టకేలకు మరో మీర్జాపూర్‌ వచ్చేసింది. అయితే తెలుగు వర్షన్‌ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో మీర్జాపూర్‌ మంచి సక్సెస్‌ ను సాధించింది. గతంతో పోల్చితే ఈసారి రెట్టింపు వ్యూస్‌ మీర్జాపూర్‌ 2కు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా తెలుగు డబ్బింగ్‌ వర్షన్ ను ప్రేక్షకుల ముందుకు అమెజాన్‌ తీసుకు రావడం లేదు. కారణం ఏంటో కాని మీర్జా పూర్‌ 2 కేవలం హిందీ మరియు ఇంగ్లీష్‌ ల్లో మాత్రమే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆ బూతు కామెడీ రొమాంటిక్‌ సన్నివేశాలను మిస్‌ అవుతున్నాం అని ఫీల్‌ అవుతున్నారు. కాస్త ఆలస్యంగా అయినా మీర్జా పూర్‌ 2 తెలుగులో వస్తుందా లేదా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.