Begin typing your search above and press return to search.
ఈ ఆంటీ గారిని తెలుగు డైరెక్టర్లు పట్టించుకోవచ్చుగా?
By: Tupaki Desk | 20 Feb 2021 3:00 PM ISTహృతిక్ రోషన్ సరసన `కహోనా ప్యార్ హై` లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది అమీషా పటేల్. బెస్ట్ డెబ్యూ నాయికగా ఫిలింఫేర్ లు ఇతర క్రేజీ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత ఐదారేళ్ల పాటు అమీషా హవాకు ఎదురే లేకుండా పోయింది.
టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించి మెప్పించింది. అటుపైనా మహేష్ సహా వరుసగా పలువురు అగ్ర తెలుగు హీరోల సరసనా అమీషా నటించింది. కానీ ఎందుకనో నిలదొక్కుకోలేకపోయింది. ఎక్కువ కాలం అమీషా పప్పులు ఉడకలేదు.
అప్పట్లోనే బాలీవుడ్ లో రేస్ సీక్వెల్ మూవీలోనూ అమీషా అందాల ఆరబోసింది. అటుపై ఐటెమ్ నంబర్ల కోసం .. అవకాశాల కోసం చాలానే వేచి చూడాల్సొచ్చింది. ఇటీవల ఏజ్ బార్ ఆంటీలా అయిపోవడంతో అస్సలు ఎవరూ పట్టించుకుంటున్నట్టే లేదు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎక్కడా అమీషాకి సరైన ఆఫర్లు లేవు. ఆ క్రమంలోనే వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టా మాధ్యమంగా చెలరేగిపోతోంది.
ఆ క్రమంలోనే నాలుగు పరభాషా చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. దేశీ మ్యాజిక్ - ది గ్రేట్ ఇండియన్ కేసినో.. తౌబా తేరా జల్వా.. ఫౌజీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇక తెలుగు దర్శకనిర్మాతలు కాస్త ఆంటీ గారిని పట్టించుకుని అవకాశాలిస్తారనే ఆశిస్తోందట. నదియా- ఇంద్రజ- రోహిణి వంటి సీనియర్లకు ఆఫర్లు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో అమీషాకి రెండో ఇన్నింగ్స్ ఉంటుందేమో చూడాలి.