Begin typing your search above and press return to search.

చీప్ స్టార్ అన్నది ఎవరినబ్బా?

By:  Tupaki Desk   |   3 Sep 2019 8:20 AM GMT
చీప్ స్టార్ అన్నది ఎవరినబ్బా?
X
ఆరెక్స్ 100 లాంటి యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాక ఏ దర్శకుడి డైరీ అయినా యమా బిజీగా ఉండాలి. కానీ విచిత్రంగా అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనే లేదు. ఇప్పటికే ఐదారుగురు హీరోల దగ్గరకు వెళ్లి ఏవేవో కారణాల వల్ల ఎవరితోనూ సెట్స్ పైకి వెళ్లలేక ఆలస్యమవుతూనే ఉంది. ఫైనల్ గా రవితేజ ఓకే చెప్పాడు అని న్యూస్ వచ్చింది. తీరా చూస్తే అదీ లేదని నిన్న ఫిలిం నగర్ టాక్.

తాజాగా తన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిన అజయ్ భూపతి సింపుల్ గా చీప్ స్టార్ అని ఒక పోస్ట్ పెట్టాడు. కేవలం రెండు పదాలు చీప్ స్టార్ అని పెట్టేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి అది ఎవరిని ఉద్దేశించిందో అర్థం కాక ఫాలోయర్స్ కామెంట్స్ నానా రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు . అసలే నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అజయ్ స్వయంగా ఒక ఫోటో పోస్ట్ చేసి విషెస్ చెప్పాడు. సో ఇప్పుడు తనను ఉద్దేశించి అనుకోవడానికి లేదు.

పోనీ తనకు ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి వద్దని చెప్పిన వాళ్ళను టార్గెట్ చేశాడా అంటే ప్రతి ఒక్క హీరోకు ఏదో ఒక స్టార్ అనే ట్యాగ్ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఇదేదో పజిల్ లా ఉందని ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు అనేసుకుంటున్నారు. కానీ ఆ నిజమేంటో ఒక్క అజయ్ భూపతికే తెలుసు. పబ్లిక్ గా పేరు రివీల్ చేయడం కష్టం కానీ అదేదో మీరే ఊహించుకుని ఫిక్స్ అయిపోయిండి అన్నట్టుంది అజయ్ తీరు. మీకేమైనా క్లూ తడుతుందేమో ఆలోచించండి