Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: క్రేజీ చిత్రాలన్నీ ఓటీటీకి క్యూ క‌ట్టాయా?

By:  Tupaki Desk   |   31 Aug 2020 6:00 PM GMT
టాప్ స్టోరి: క్రేజీ చిత్రాలన్నీ ఓటీటీకి క్యూ క‌ట్టాయా?
X
దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్ర‌క్రియ మొద‌లైనా థియేట‌ర్లు తెరుచుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో క్రేజీ చిత్రాల‌న్నీ ఓటీటీ బాట ‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే బాలీవుడ్ .. కోలీవుడ్ ‌కు సంబంధించిన క్రేజీ చిత్రాల‌న్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ తంతు నేచుర‌ల్ స్టార్ నాని.. యంగ్ హీరో సుధీర్ ‌బాబు న‌టించిన `వి` సినిమాతో మొద‌లైంది.

నాని.. సుధీర్ ‌బాబు న‌టించిన `వి` చిత్రం సెప్టెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్ ‌గా 200 థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. ఓటీటీలో డైరెక్ట్ గా విడుద‌ల‌వుతున్న తొలి తెలుగు సినిమా ఇదే కావ‌డంతో ఈ సినిమా ఫ‌లితంపైనా తొలి రోజు వ్యూస్ పైనా స‌ర్వ‌త్రా చ‌ర్చ ‌న‌డుస్తోంది. ఈ మూవీ త‌రువాత తెలుగు సినిమాలు వ‌రుస‌గా ఓటీటీకి క్యూ క‌ట్ట‌డానికి సిద్ధంగా వున్నాయి. సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న‌ `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`.. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న `రెడ్‌`.. అనుష్క న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `నిశ్శ‌బ్దం`... క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుహాస్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న `క‌ల‌ర్ ఫొటో` రిలీజ్‌కి రెడీ అయిపోతున్నాయి.

సాయి ‌తేజ్ న‌టిస్తున్న‌ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` జీ5లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అక్టోబ‌ర్ ‌లో రిలీజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `రెడ్‌` డిస్నీ హాట్ స్టార్ ‌లో రిలీజ్ అవుతోంది. అనుష్క న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `నిశ్శ‌బ్దం` నెట్ ‌ఫ్లిక్స్ ‌లో రాబోతోంది. ఇక సుహాస్ న‌టిస్తున్న `క‌ల‌ర్ ఫోటో` డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ `ఆహా`లో రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. అయితే ర‌వితేజ `క్రాక్‌` మాత్రం ఓటీటీకి రావ‌డం లేదు. లేట్ అయినా లేటెస్ట్‌గా థియేట‌ర్ ‌కే అంటున్నారు మేక‌ర్స్‌.