Begin typing your search above and press return to search.

భలే సినిమాలు సెట్ చేస్తున్నారుగా..

By:  Tupaki Desk   |   30 May 2018 4:13 AM GMT
భలే సినిమాలు సెట్ చేస్తున్నారుగా..
X
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ లో ఎప్పుడూ స్పెషల్ ఇంట్రస్ట్ ఉంటుంది. ఈ సీజన్ లో రిలీజ్ చేస్తే హిట్ దక్కుతుందని కొందరికి సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సంగతి పక్కన పెడితే సంక్రాంతి సీజన్ లో రిలీజైన సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. అందుకే సంక్రాంతి రేసులో నిలిచేందుకు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. మిగతా టైంలో పోటీలు వద్దని అనుకున్నా సంక్రాంతికి మాత్రం పోటాపోటీగా పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తుంటారు.

2019 సంవత్సరంలో సంక్రాంతి పండగకు రిలీజవబోయే పెద్ద సినిమాలపై ఇప్పటికే టాలీవుడ్ లో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ రేసులోకి ముందుగా రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తేజ్ దిగనున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ జనవరి 11న రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 12న రిలీజవుతుంది. పండగ రోజున విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ ఏడాది సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. బాలకృష్ణ నటించిన జై సింహా రిలీజయ్యాయి. వీటితోపాటు చిన్న సినిమాగా రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం వచ్చింది. వీటిలో జై సింహా యావరేజ్ టాక్ తో లాభాలు తెచ్చుకోగా మిగతా రెండూ డిజాస్టర్లయ్యాయి. వచ్చే ఏడాది మాత్రం అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే అప్పటికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటికి రేసులో ఏవి ఉంటాయో.. ఏవి వెనక్కి వెళ్తాయో వేచి చూడాలి.