Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: కరెన్సీ నోట్ల దెబ్బ గట్టిదే

By:  Tupaki Desk   |   14 Nov 2016 11:59 AM GMT
టికెట్ కౌంటర్: కరెన్సీ నోట్ల దెబ్బ గట్టిదే
X
గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత భయంకరమైన సిట్యుయేషన్ ఎదుర్కొంటోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. టాలీవుడ్ ని చావుదెబ్బ కొట్టింది. జనాల చేతుల్లో ఉన్న పెద్ద నోట్లను తీసుకునే పరిస్థితి థియేటర్లకు లేకపోవడం.. ఉన్న ఉన్న కాసిన్ని చిన్న నోట్లను సినిమాలకు ఖర్చుచేసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేకపోవడంతో.. ఈ వీకెండ్ సినిమా థియేటర్లన్నీ వెలవెల బోయాయి.

ఈ వారం నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అయ్యి.. మంచి టాక్ తెచ్కుకున్నా వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క హైద్రాబాద్ లో మాత్రమే కలెక్షన్స్ పర్లేదనిపించే స్థాయిలో ఉండగా.. మిగిలిన ఏరియాస్ లో వచ్చిన వసూళ్లను బయటకు చెప్పుకోలేని పరిస్థితి. కొత్తగా రిలీజ్ అయ్యి.. బాగుందని అనిపించుకుంటున్న సినిమా సిట్యుయేషనే ఇలా ఉంటే.. గతవారం అంతకుముందు వారం వచ్చి.. నెట్టుకొస్తున్న సినిమాల పరిస్థితి.. డెఫిసిట్ లో పడిపోయింది.

బాలీవుడ్ మూవీ రాక్ ఆన్2 కూడా ఈ కరెన్సీ స్లంప్ లో పడి డిజాస్టర్ గా మారిపోయింది. కార్డులతో ఆన్ లైన్ లో టికెట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉన్న మల్టీప్లెక్సుల్లోనే పరిస్థితి దారుణంగా ఉంటే.. సింగిల్ స్క్రీన్ ల పరిస్థితి మరీ తీసికట్టు అన్నట్లుగా ఉంది. సినిమాలు నడపడం కోసమే రన్ చేయడం తప్ప.. ఆడియన్స్ ఉన్నారా లేదా అని కూడా పట్టించుకునే సిట్యుయేషన్ లేదు.

వారం వారం టాప్ 5 వసూళ్లను సాధించిన సినిమాల లిస్ట్ ను టికెట్ కౌంటర్ రూపంలో ఇస్తున్నా.. ఈ వారం అలా రాసేందుకు కూడా పరిస్థితులు సహకరించడం లేదంటే.. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న వాతావరణం అర్ధం చేసుకోవచ్చు. ఈ దెబ్బతో ఈ వారం రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నీ.. నిరవధికంగా వాయిదా వేసేసుకుంటున్నాయి.

టికెట్ కౌంటర్లు మళ్లీ యథాతథ స్థితికి రావాలంటే.. మరి కొన్ని రోజులు పట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/