Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: హైపర్ హవా, ధోనీ సునామీ

By:  Tupaki Desk   |   3 Oct 2016 7:30 AM GMT
టికెట్ కౌంటర్: హైపర్ హవా, ధోనీ సునామీ
X
బాక్సాఫీస్ ని కొత్త సినిమాలు కళకళలాడిస్తున్నాయి. వీకెండ్ తోపాటే దసరా సీజన్ కూడా వచ్చేయడం సినిమాలకు బాగా కలిసొచ్చేసింది.

1. హైపర్: రామ్ మూవీ హైపర్ కి అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ అదిరిపోయేలా వస్తున్నాయి. రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేకపోయినా.. టాక్ ఏవరేజ్ గా ఉన్నా.. కౌంటర్లలో మాత్రం కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి. బీ సీ సెంటర్లలో ఈ మూవీ బాగానే వసూలు చేయనుంది.

2. ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ: బాక్సాఫీస్ ఎదురుచూడని సంచలనాన్ని ధోనీ మూవీ సృష్టించేస్తోంది. లెంగ్త్ ఎక్కువైందని.. సినిమా అంత ఆకట్టుకునేలా లేదనే టాక్ ని జనాలు పట్టించుకోవడం లేదు. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తోంది.

3. మజ్ను: కలెక్షన్స్ కుమ్మేయడానికి నాని మజ్నుకి మరో వీకెండ్ లభించింది. వీక్ డేస్ లో కొంచెం డ్రాప్ అయినా.. మళ్లీ వీకెండ్ లో బాగా పుంజుకున్నాడు మజ్ను. గ్యారంటీగా ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుందనే అంచనాలున్నాయి

4. పింక్: అమితాబ్ బచ్చన్.. తాప్సీలు ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ మూవీకి.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. హైద్రాబాద్ లో కలెక్షన్స్ ఇంకా సాలిడ్ గా ఉన్నాయి.

5. జ్యో అచ్యుతానంద: శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటికే హిట్ అయిపోయింది. వసూళ్లు ఇంకా కంటిన్యూ అవుతుండడంతో.. అటు అవసరాలకు రెండో హిట్ కాగా.. నారా రోహిత్ కి వారాహి బ్యానర్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/