Begin typing your search above and press return to search.

గిన్నిస్ రికార్డులలో తెలుగు సినిమా

By:  Tupaki Desk   |   20 Sep 2015 10:30 PM GMT
గిన్నిస్ రికార్డులలో తెలుగు సినిమా
X
దాదాపు 85ఏళ్ళ పైన చరిత్ర వున్న తెలుగు సినిమా ఎన్నో మైలురాళ్ళను దాటుకుని, ఎన్నో ముధరమైన సంఘటనలను పొందుపరుచుకుని వంద సంవత్సరాల వైపుకి పరుగులు తీస్తుంది. అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రికార్డులకు నిఘంటువుగా నిలిచిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో పలుమార్లు మన తెలుగు సినిమా, తెలుగు సినిమా సభ్యులు చరిత్ర లఖించారు. వాటిని ఒకసారి స్మరించుకుంటే..

* ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. దాదాపు 1700ఎకరాల సువిశాలమైన నిర్మాణంలో ఎన్నో వేల సినిమాలకు ఈ ఫిలింసిటీ బాసటగా నిలిచింది. స్క్రిప్ట్ తో లోపలి వెళ్తే ఫైనల్ కాపీతో బయటకు వచ్చే అన్ని టెక్నాలజీలు ఇందులో వుండడం విశేషం.

* సినిమా రంగానికి సంబంధించి దాదాపు 130 సినిమాలను ఒకే వ్యక్తీ నిర్మించడం ఘనమైన రికార్డు. మూవీ మొఘల్ డి. రామానాయుడు గారు ఈ రికార్డుని నెలకొలిపి చరిత్రలో నిలిచారు. దేశంలో మాట్లాడే ప్రధాన బాషలన్నిటిలో సినిమా తీయాలన్నది ఆయన కల.

* 800లకు పైగా సినిమాలలో నటించి ఇప్పట్లో ఎవరూ చెరపలేని రికార్డుని స్థాపించారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. బ్రాహ్మి వుంటే సినిమా హిట్ అనే రేంజ్ కి చేరుకున్న ఈ అరగుండు కి గిన్నిస్ సాదర స్థానం అందించింది.

* ఒక గళంనుండి కొన్ని వేల సంఖ్యలో పాటలు రావడం, అవి సినిమా పాటలు కావడం అత్యంత అరుదు. ఈ అరుదైన అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యాన్ని గిన్నిస్ బుక్ తనలోని ఎంట్రీ ఇచ్చి పులకించిపోయింది.

* ఆడది వ్యక్తి కాదు శక్తి అని నిరువుపించిన లేడీ డైనమిక్ డైరెక్టర్ విజయనిర్మల. ఈమె తప్ప ప్రపంచంలో మరే లేడీ డైరెక్టర్ అన్ని సినిమాలకు దర్శకత్వం వహించకపోవడం విశేషం.

* ఇక రీసెంట్ గా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాకి సంబంధించిన అతిపెద్ద పోస్టర్ ని ఇటీవలే కేరళలో ప్రదర్శించి గిన్నిస్ బుక్ లో స్థానం కొట్టేశారు. అవండీ మన సినిమా రికార్డులు.