Begin typing your search above and press return to search.

న‌వంబ‌ర్ లో కూడా రిలీజ్‌ లే రిలీజ్‌ లు!!

By:  Tupaki Desk   |   30 Sep 2015 9:30 AM GMT
న‌వంబ‌ర్ లో కూడా రిలీజ్‌ లే రిలీజ్‌ లు!!
X
మ‌న‌వాళ్ల‌కు ఓ సెంటిమెంట్ ఉంది. న‌వంబ‌ర్‌ లో రిలీజ్ చేసిన సినిమాలేవీ ఆశించినంత పెద్ద విజ‌యం సాధించ‌వ‌నే చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌తి ఏడాది న‌వంబ‌ర్‌ కి ముందు, న‌వంబ‌ర్ త‌ర్వాత రిలీజ్ చేసేందుకు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎక్కువ ఆస‌క్తి చూపిస్తుంటారు. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా నాలుగైదు సినిమాలు రిలీజ్‌ ల‌కు వ‌స్తున్నాయి. సెంటిమెంటును వ‌దిలిపెట్టి ఇదో కొత్త ఎటెంప్ట్ అనే చెప్పాలి. ఈ ద‌స‌రా బ‌రిలో బ్రూస్ లీ - అఖిల్‌ - రుద్ర‌మ‌దేవి వంటి సినిమాలు రిలీజైపోతున్నాయి. అక్టోబ‌ర్ వెళ్లి న‌వంబ‌ర్ వ‌స్తోంది అన‌గానే బోలెడ‌న్ని క్రేజీ ప్రాజెక్టులు క్యూలో వ‌చ్చేస్తున్నాయి. వారం గ్యాప్ మెయింటెయిన్ చేస్తూ ఆ నెల‌లో సినిమాల‌న్నీ రిలీజ్‌ ల‌కు వ‌స్తున్నాయి. వాటి డీటెయిల్స్‌....

ప్రారంభం ర‌వితేజ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బెంగాల్ టైగ‌ర్ న‌వంబ‌ర్ 5 న రిలీజ‌వుతోంది. ఆ సినిమా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కంచె రిలీజ‌వుతుంది. న‌వంబ‌ర్ 6న రిలీజ్ అవుతుంద‌ని చెబుతున్నారు. అలాగే క‌మ‌ల్‌ హాస‌న్ -త్రిష జంట‌గా సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌తిష్టాత్మ‌క యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చీక‌టిరాజ్యం దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. అటుపై న‌వంబ‌ర్ రెండో వారంలో నిఖిల్ హీరోగా కోన‌ వెంక‌ట్ నిర్మిస్తున్న శంక‌రాభ‌ర‌ణం రిలీజ‌వుతుంది. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య - గౌత‌మ్‌ మీన‌న్ కాంబినేష‌న్ సినిమా సాహ‌సం శ్వాస‌గా సాగిపో .. న‌వంబ‌ర్ చివ‌రిలో రిలీజ‌వుతోంది. ఇలా వ‌రుస‌గా న‌వంబ‌ర్ మాసం అంతా ఫిలింఫెస్టే.