Begin typing your search above and press return to search.

ఆంధ్రలోనూ సినీ ఇండస్ట్రీ..మంచి రోజులొచ్చినట్టే

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:26 PM GMT
ఆంధ్రలోనూ సినీ ఇండస్ట్రీ..మంచి రోజులొచ్చినట్టే
X
అందమైన సముద్రతీరంతో ఆకర్షించే విశాఖ నగరం ఎన్నో సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌. అనేక చిన్న చిత్రాల నుంచి పెద్ద సినిమాల వరకు అందాలను తమ ఫ్రేమ్‌లో బంధిస్తుంటాయి. అయితే రానున్న రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ స్టీల్‌ సిటీలోనూ మకాం వేయనుందా ? .. ఆంధ్ర ప్రాంతంలో టాలీవుడ్‌ చిత్రాల నిర్మాణాలు మరింత పెరగనున్నాయా ? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగు సినీ అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ - శ్యాంప్రసాద్‌ రెడ్డితోపాటు జెమిని కిరణ్‌ లతో కూడిన బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. వీరితోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. హుద్‌ హుద్‌ తుఫాను సమయంలో బాధితుల పక్షాన సినీ ఇండస్ట్రీ ఎలా అండగా నిలిచిందో వివరించారు. షూటింగ్‌ లు సైతం వాయిదా వేసుకుని తుఫాను బాధితుల కోసం పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్‌ ఎన్‌ టీఆర్ - మహేష్‌ బాబు - సంపూర్ణేష్‌ బాబు - రామ్‌ చరణ్‌ వంటి నటులు వ్యక్తిగతంగా సాయం అందించినట్లు తెలిపారు. అదే సమయంలో రెండు రోజులపాటు పూర్తిగా సినిమా షూటింగ్‌ లు - ఇతర కార్యక్రమాలు నిలిపివేసి.. టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇది ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగింది...ఎందరో ప్రేక్షకులు వీక్షించారు. ఈ షోలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది నటీనటులు పాల్గొని తమ వంతు చేయూత అందించారు. ఈ షో ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని - ఆ డబ్బులతో తుఫాను బాధితుల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎంను కలిసిన అగ్ర నిర్మాతలు వివరించారు. మొత్తం 320 ఇళ్లు నిర్మించి ..ఇప్పుడు ఆ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు.

ఇదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సాయమందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసినట్లు సమాచారం. అగ్ర నిర్మాతల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ లో సినీ స్టూడియోల నిర్మాణానికి - షూటింగ్‌ లకు సహకారమందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక హుద్‌ హుద్‌ తుఫాను సమయంలో బాధితుల కోసం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అండగా నిలిచిన సినీ ఇండస్ట్రీని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక అభినందించినట్లు సినీ పెద్దలు చెబుతున్నారు. దీనికి బట్టి తెలుగు సినీ ఇండస్ట్రీ ఆంధ్ర ప్రాంతంలోనూ మరింత విస్తరించేందుకు సుగమమైనట్టేనని సంబరపడుతున్నారు.