Begin typing your search above and press return to search.

తెలుగులోకి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ 'కాలా'

By:  Tupaki Desk   |   24 May 2021 10:30 AM GMT
తెలుగులోకి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ కాలా
X
తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ వస్తోంది 100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'. ఈ క్రమంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ కి పెడుతోంది. ఇప్పటికే ఈ యాప్ లో విడుదలైన మలయాళ డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ''కాలా'' అనే మరో మలయాళ డబ్బింగ్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు.

'మారి 2' 'లూసిఫర్' 'ఫోరెన్సిక్' 'మయానది' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ''కాలా''. రోహిత్ వి. ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇగో - హింస - ప్రతీకారం అనే అంశాలతో.. మనుషులకు జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని తీసుకొని, రియలిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే ఇప్పుడు మలయాళ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ''కాలా'' ను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆహా ఓటీటీలో జూన్ 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో దివ్య పిళ్ళై - లాల్ - సుమేష్ మూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో టోవినో థామస్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.