Begin typing your search above and press return to search.

ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన తెలుగు అందం..!

By:  Tupaki Desk   |   19 March 2021 8:35 AM GMT
ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన తెలుగు అందం..!
X
''జాతిరత్నాలు'' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. దాదాపు ఏడేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌ గా పని చేసిన ఫారియా.. 'నక్షత్ర' అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడి 'జాతిరత్నాలు' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ విడుదలకు ముందే తన హైట్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ ను సైతం ఆశ్చర్యపరచడంతో అందరి ఫోకస్ ఫారియాపై మళ్లింది. 'ఈవిడేంటి.. నా కంటే పొడుగుంది' అంటూ ప్రభాస్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

ఇంక 'జాతిరత్నాలు' సినిమాలో తన స్క్రీన్ ప్రెజన్స్ - క్యూట్ ఎస్ప్రెషన్ తో అమాయకత్వంలో కూడిన స్మార్ట్‌ గర్ల్ 'చిట్టి' పాత్రలో నటించి యువతను తనవైపు తిప్పుకుంది. తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఫరియా. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో అమ్మడి పేరే హాట్ టాపిక్. ఇప్పటికే కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు ఫారియాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేయాలని డిసైడై సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

నిజానికి ఫరియా అబ్దుల్లా తెలుగమ్మాయే కానీ తెలుగు భాష అంతగా రాదని తెలుస్తోంది. హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌ కు చెందిన ఫారియాకు ఉన్న క్రేజ్ ను చూస్తే టాలీవుడ్ లో పాగా వేసేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో ఫరియా అబ్దుల్లాను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ హైట్ బ్యూటీకి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.