Begin typing your search above and press return to search.

అనసూయ.. రష్మీ.. ఓ బీచ్లో కూర్చొని..

By:  Tupaki Desk   |   25 Oct 2017 11:16 PM IST
అనసూయ.. రష్మీ.. ఓ బీచ్లో కూర్చొని..
X
వెండి తెర అయినా సరే బుల్లి తెర అయినా సరే నేటి తరం నటీమణులు వారి అందాలతో అన్ని వర్గాల అభిమానులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యాంకర్స్ అయితే స్టార్స్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూస్తే యాంకర్స్ కి ఇంత స్టార్ హోదా ఉంటుందా అనుకుంటాం. స్టార్ హీరోయిన్స్ పెరు గుర్తుండకపోవచ్చేమో గాని నేటి తరం యువకులకు యాంకర్స్ పెరు మాత్రం బాగానే గుర్తుంటున్నాయి.

అలా గుర్తుండేలా యాంకర్స్ కూడా వారి మాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక అందాలతో కనువిందు చేసే భామలు మాత్రం కొందరే ఉన్నారని చెప్పాలి. వారిలో అనసూయ - రష్మీ టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు అందాలతో జబర్దస్త్ యాంకర్స్ అని గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే యాంకర్స్ ఇద్దరు చాలా క్లోజ్ అని రీసెంట్ గా ఒక ఫొటో ద్వారా చెప్పేశారు. గోవాలో సముద్రం ఒడ్డున రాళ్లపైన కూర్చొని చల్లని వేదర్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ.. నవ్వుకుంటున్నారు. వారిద్దరూ ఆ స్మైల్ తో ఏం మాట్లాడుకుంటున్నారో గాని చూసిన వారంతా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.

అనసూయ అందం రష్మీ పరువం అని నెటీజన్స్ టైటిల్స్ ఇచ్చేస్తున్నారు. ఇక అనసూయ ఒక హార్ట్ టచింగ్ కామెంట్ పెట్టింది. ‘స్ట్రాంగ్ వుమేన్ ను గుర్తించడం చాలా ఈజి.. ఒకరికొకరు ఉన్నత స్థాయికి చేరేందుకు సహకరించుకుంటారు. అంతేకానీ అణగదొక్కేందుకు ట్రై చేయరు’ అని ఆ ట్వీట్ లో అనసూయ పేర్కొంది. పైగా వర్కులోనే కాదు.. బయట కూడా స్నేహితులం అంటూ సెలవిచ్చింది.