Begin typing your search above and press return to search.

అందుకే జాతకాలు బయటకొస్తున్నాయంట

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:30 PM GMT
అందుకే జాతకాలు బయటకొస్తున్నాయంట
X

ఆ భామ చెప్పుకోదగిన స్థాయిలో సినిమాలేమీ చేయలేదు కానీ.. ఆమె గురించి తెలియని తెలుగు సినిమా జనాలు ఉండరంటే తప్పేమీ కాదు. తన చర్యలతో కొన్ని నెలలుగా అంతగా హల్ చల్ చేస్తున్న ఈమె.. ఒకే ఒక్క మిస్టేక్ తో మొత్తం నాశనం చేసుకుని.. ఎవరూ తనను పట్టించుకోవాల్సిన అవసరం లేని స్థితికి చేరిపోయింది.

అలాగని ఈమె ఏమీ సైలెంటుగా ఉండిపోలేదు. తన పోరాటం ఆగదని చెబుతూనే ఉంది. అందుకు తగినట్లుగానే ఓ హీరో మీద పగ పట్టేసిన స్థాయిలో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియాలో ఈమె స్థాయిలో బూతులు ఉపయోగించిన మరో సెలబ్రిటీ (నెట్లో ఫాలోయింగ్ ఉంటే సెలబ్రిటీనే అనుకునే వాళ్ల తృప్తి కోసం) ఉండదేమో. అయితే.. నానాటికీ ఈమెను పట్టించుకుంటున్నవారు లేరు. మీడియాకు కూడా గట్టిగానే ఝలక్ తగలగడంతో.. కిమ్మనడం లేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఈమె రాతలపై ఇంకా అడపా దడపా న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడీమెకు అమెరికాలో జరిగిన సెక్స్ స్కాండల్ వరంలా తగిలింది.

అందులో చిక్కుకున్న నటీమణుల సంగతేమో కాని.. ఈమె మాత్రం భలే వాడేసుకుంటోంది. ఆ యాక్ట్రెస్ లు.. యాంకర్లు.. టీవీ తారలు.. ఇలా వాళ్లందరూ తనకు తెలుసు అని.. ఇప్పటికే నేషనల్ ఛానల్ లో కూడా మాట్లాడేశానని భలేగా కబుర్లు చెప్పేసుకుంటోంది. అంతెందుకు.. తాజాగా ఈమె పోస్ట్ చూస్తే.. ఈవిడ తీగ లాగితే.. అమెరికాలో డొంక కదిలిపోయిందట. అందుకే అందరి జాతకాలు బయటకు వచ్చేస్తున్నాయట. ఈమె అడిగిందేదో ఇచ్చేస్తే.. ఇకపై ఇలాంటివి ఉండవు కదా అంటోంది. ఏం జరిగినా అంతా నా ప్రతిభే.. నా శక్తే అనుకునే వాళ్లకు ఎవరు మాత్రం ఏం చెప్పగలరు చెప్పండి.