Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ హీరోయిన్ మళ్లీ వస్తోంది

By:  Tupaki Desk   |   9 Aug 2016 10:35 AM IST
సెన్సేషనల్ హీరోయిన్ మళ్లీ వస్తోంది
X
90ల్లో తెలుగు తెరను షేక్ చేసిన హీరోయిన్లలో రంభ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసనా హీరోయిన్ గా నటించిన రంభ.. తెలుగు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓ నాలుగైదేళ్ల పాటు అయితే రంభ హవా మామూలుగా సాగలేదు. హీరోయిన్ గా జోరు తగ్గిపోయాక కూడా కొన్నాళ్లు సినీ రంగాన్నే అంటిపెట్టుకుని ఉన్న రంభ.. 2010లో ఇంద్రన్ పద్మనాభన్ అనే తమిళ వ్యాపారవేత్తను పెళ్లాడి కెనడాలో సెటిలైపోయింది. తెలుగులో రంభ చివరగా కనిపించిన సినిమా ‘యమదొంగ’. అందులో నాచోరే నాచోరే పాటకు అదిరిపోయే రేంజిలో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి జ్నాపకాన్ని మిగిల్చి హీరోయిన్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది రంభ.

పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా కన్న రంభ.. ఇకపై మళ్లీ సినిమాల వైపు చూడదేమో అనుకున్నారంతా. కానీ.. ఇన్నేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఐతే ఆమె మళ్లీ ముఖానికి రంగేసుకోవాలనుకోవట్లేదు. తెర వెనుకే ఉండి సినిమాలు నిర్మించాలనుకుంటోంది. తన పేరిట ఓ బేనర్ మొదలుపెట్టి చిన్న-మీడియం రేంజి సినిమాలు తీస్తుందట రమ్య. ఇందుకోసం ప్రస్తుతం కథలు వింటోందట. ఐతే నటన నుంచి నిర్మాణంలోకి వచ్చిన హీరోయిన్లెవ్వరూ కూడా నిర్మాణంలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. రంభ కంటే ముందు భూమిక.. సిమ్రాన్ లాంటి హీరోయిన్లు ఇలాగే ప్రయత్నించి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. చక్కగా భర్త వ్యాపారంలో ఏమైనా సాయం చేసుకోక.. గ్యాంబ్లింగ్ లాగా మారిపోయిన సినీ నిర్మాణంలోకి ఎందుకొస్తోందో రంభ.