Begin typing your search above and press return to search.

ఎస్కేప్ ప్లాన్ లో తెలుగ‌మ్మాయ్.. అస‌లేమైంది?

By:  Tupaki Desk   |   21 Jun 2021 1:30 PM GMT
ఎస్కేప్ ప్లాన్ లో తెలుగ‌మ్మాయ్.. అస‌లేమైంది?
X
బిగ్ బాస్ సీజ‌న్ -2 త‌ర్వాత తేజ‌స్వి మాదివాడ సినీకెరీర్ ప‌రుగులు పెడుతుంద‌నే భావించారు. కానీ ఇక్క‌డ అంత సులువేమీ కాద‌ని అర్థ‌మైంది. బాబు బాగా బిజీ- బాల‌కృష్ణుడు లాంటి సినిమాల త‌ర్వాత వెబ్ సిరీస్ ల‌వైపు మ‌ళ్లింది. అప్ప‌ట్లో `మ‌న ముగ్గురి ల‌వ్ స్టోరి` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. అదే స‌మ‌యంలో బిగ్ బాస్ లో కంటెంస్టెంట్ గా ఛాన్స్ వ‌చ్చింది.

అయితే బిగ్ బాస్ ఈ బ్యూటీకి క‌లిసొచ్చిన‌ట్టు లేద‌న్న టాక్ కూడా వినిపించింది. రియాలిటీ షో త‌ర్వాత పెద్ద‌తెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. క‌మిట్ మెంట్ అనే ఇండ‌స్ట్రీ వేధింపులపై తీస్తున్న‌ సినిమాలో న‌టిస్తున్నా అది ఎంత‌వ‌ర‌కొచ్చింది అన్న‌ది క్లారిటీ రాలేదు. ఇంత‌లోనే కొవిడ్-19 ప్ర‌వేశంతో అంతా అస్త‌వ్య‌స్తంగా మారిపోయింది. తేజ‌స్వీనే కాదు.. మొత్తం ప్ర‌పంచం ఉపాధి లేక అల్లాడింది.

కానీ ఇప్పుడు క‌రోనాపై నెపం వేయ‌డానికి లేదు. ఇంకా తేజ‌స్వి న‌టించే సినిమాల వ్య‌వ‌హారాలేవీ బ‌య‌ట‌కు తెలియాల్సి ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉన్న ఈ బ్యూటీ ఇటీవ‌ల స‌డెన్ గా ఎందుక‌నో స్లో అవ్వ‌డంతో అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే.. తెలుగులో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఛాన్సులిస్తున్నా తేజ‌స్వి కాద‌ని త‌ప్పించుకుని తిరుగుతోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. కాస్టింగ్ వాళ్ల‌ కంట‌ ప‌డ‌కుండా త‌ప్పించుకుని తిరుగుతోందిట‌. మ‌రి ఈ గోప్యత దేనికో? ఏదైనా ప్ర‌యోగం చేయ‌బోతోందా? అంటూ ఇప్పుడు కొత్త డౌట్ ఉత్కంఠ పెంచుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ ! అంటూ వ‌చ్చిన తేజ‌స్వికి అస‌లు ఏమైంది? ఇప్పుడిలా ఎస్కేప్ ప్లాన్ దేనికి? అంటూ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ని మించి బాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో ఉందా? అనే సందేహం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే గాక‌ ఇత‌ర వ్యాపారాలు..కుటుంబ వ్య‌వ‌హారాల్లో ప‌డి క‌నిపించ‌డం లేదా? అన్న‌ది తేజ‌స్వి నే చెప్పాలి. మ‌హేష్‌ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో తేజ‌స్వీ తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే రాంగోపాల్ వ‌ర్మ దృష్టిలో ప‌డింది. దీంతో వ‌ర్మ తేజ‌స్వీని లీడ్ రోల్ లో ఐస్ క్రీమ్ అనే ప్ర‌యోగం చేసారు. కానీ అది ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు.