Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయి ధమాకా ఐటెం సాంగ్‌

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:46 AM GMT
తెలుగమ్మాయి ధమాకా ఐటెం సాంగ్‌
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన రూపొందుతున్న చిత్రం ధమాకా. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ ను ముగించిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా పెళ్లిసందD ముద్దుగుమ్మ శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. రవితేజ మరియు శ్రీలీల కాంబో ఎలా ఉంటుందా అంటూ అభిమానులు సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్న శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్ గా మారిపోయింది. తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. మొదటి సినిమా నిరాశ పర్చినా ఈ స్థాయిలో ఆపర్లు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా లో ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతుందని మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. త్రినాథరావు నక్కిన ఒక మంచి మాస్ ఎంటర్‌ టైన్ మెంట్‌ గా సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మంచి మాస్ సాంగ్‌ ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ధమాకా సినిమాలో ఐటెం సాంగ్‌ ను అనసూయ చేయబోతున్నట్లుగా కొన్ని వారాల క్రితం వార్తలు వచ్చాయి. కాని అనసూయ ఇప్పటికే రవితేజ మరో సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఆమెతో ఐటెం సాంగ్‌ చేయించడం సరికాదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అనసూయ పేరు పరిశీలించినా ఆ తర్వాత పక్కకు పెట్టారు. ఆ తర్వాత పాయల్‌ రాజ్ పూత్ పేరు కూడా వినిపించింది. ఇప్పటికే రవితేజతో ఆమె రొమాన్స్ పూర్తి అయ్యింది. ఇద్దరి కాంబోకు పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అందుకే పాయల్ ను కూడా వద్దనుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా లోని ఐటెం సాంగ్ కోసం తెలుగమ్మాయి ఈషా రెబ్బాను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తెలుగమ్మాయి అయినా కూడా ముంబయి ముద్దుగుమ్మకు ఏమాత్రం తీసి పోకుండా అందాల ఆరబోతతో పాటు డాన్స్ విషయంలో స్పీడ్ ను చూపిస్తుంది. అందుకే ఈ సినిమాలో ఆమెతో ఐటెం సాంగ్ చేయడం వల్ల మంచి మైలేజ్ ను దక్కించుకోవచ్చు అంటూ మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్రినాధరావు నక్కిన ఇప్పటికే ఈషా తో చర్చలు జరిపారని.. ఇప్పటి వరకు ఐటెం సాంగ్ చేయని ఈషా మొదటి సారి ఐటెం సాంగ్ కోసం ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో ఈషా ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. రవితేజ మరియు త్రినాధరావు నక్కినల కాంబో మూవీపై ఉన్న బజ్ నేపథ్యంలో సినిమాను స్పీడ్‌ గా పూర్తి చేసి వచ్చే సమ్మర్ వరకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.