Begin typing your search above and press return to search.
కొత్త లుక్కులో చూపరులను ఆకట్టుకుంటున్న తెలుగు సీతమ్మ!!
By: Tupaki Desk | 26 July 2020 7:00 AM ISTతెలుగు బ్యూటీ అంజలి అంటే సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని రాజోలు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ భామ.. రాజోలులోనే స్కూలింగ్ పూర్తి చేసి చెన్నైకి వెళ్లిపోయిందట. ఇక అక్కడే కాలేజీ లైఫ్ గడిపింది. మాథమెటిక్స్ లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మెల్లగా యాక్టింగ్ వైపు మళ్లింది. చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి మోడలింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇక 2006లో మోడలింగులో ఉండగానే తెలుగు డైరెక్టర్ శివనాగేశ్వరరావు 'ఫోటో' మూవీలో అవకాశం ఇచ్చారు. అదే అంజలి ఫస్ట్ మూవీ. ఆ తర్వాత 'ప్రేమలేఖ రాసా' మూవీ చేసింది కానీ అది ప్లాప్ అవ్వడంతో తమిళం వైపు అడుగేసింది. ఇక 2007లో 'కాట్రాదు తమిజా' సినిమాతో తమిళంలో డెబ్యూ అయి ఫస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో హిట్స్ అందుకుంది.
జర్నీ, షాపింగ్ మాల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి.. ఇలా వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి సినిమాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకుంది. దాదాపు అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించింది. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న అంజలి.. ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. అన్నట్లు సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఎప్పటికప్పుడు అంజలి పోస్ట్ కోసం ఎదురు చూస్తూ లైక్ కొట్టి షేర్ చేస్తుంటారు. ఇటీవలే రోడ్డు పై డాన్స్ చేస్తున్న పిక్ పెట్టి కరోనా పోతే ఫుల్లుగా డాన్స్ చేస్తానని చెప్పింది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మడు పడుకొని కెమెరా వైపు బంగారు బొమ్మలా చూస్తూ ఉంది. ఎల్లో చుడిదార్ లో అంజలి.. అందమైన మోము చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చ తెలుగందం ఉట్టిపడుతుంది అని నెటిజన్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.