Begin typing your search above and press return to search.

నా సినిమాల్లో తెలుగు నటులకే ప్రాధాన్యమిస్తాః సుకుమార్‌

By:  Tupaki Desk   |   8 March 2021 10:14 AM IST
నా సినిమాల్లో తెలుగు నటులకే ప్రాధాన్యమిస్తాః సుకుమార్‌
X
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలుగు వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ అన్నారు. ఆయన వద్ద స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లే బ్యాక్’. ఈ మూవీలో దినేష్ తేజ్ హీరోగా, అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్ గా న‌టించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలో స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

ఈ సంద‌ర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వ‌డం అభినందించాల్సిన విష‌యం అన్నారు. టాలీవుడ్లో తెలుగు వారిని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను కూడా ఆ ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. త‌న చిత్రాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల‌కు తెలుగు వారినే ఎంపిక చేస్తుంటాన‌ని చెప్పారు సుక్కూ.

తెలుగుపై ప‌ట్టుంద‌నే ఉద్దేశంతోనే ‘రంగస్థలం’ సినిమాకు సమంతను తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు అన‌సూయ‌ను కూడా తీసుకున్న విష‌యం తెలిసిందే. త‌న రాబోయే చిత్రాల్లోనూ తెలుగు వారికి అవ‌కాశాలు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించిన సుకుమార్‌.. నెక్స్ట్ మూవీలో తెలుగు అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. ఇక‌, ప్రేక్ష‌కులు కొత్త క‌థ‌ల‌ను ఆద‌రిస్తార‌న్న విష‌యాన్ని ‘ప్లే బ్యాక్’ మరోసారి నిరూపించింద‌ని అన్నారు.