Begin typing your search above and press return to search.

సీనియర్ కమెడియన్ కు హార్ట్ సర్జరీ

By:  Tupaki Desk   |   16 Jan 2019 11:38 AM IST
సీనియర్ కమెడియన్ కు హార్ట్ సర్జరీ
X
పాపులర్ తెలుగు కమెడియన్ బ్రహ్మానందంకు ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్(ఎహెచ్ఐ) లో సోమవారం నాడు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగిందని సమాచారం. అయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. బ్రహ్మానందం తనయులు రాజా గౌతమ్.. సిద్దార్థ్ లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆయనతో హాస్పిటల్ వద్దే ఉన్నారు.

62 ఏళ్ళ బ్రహ్మానందం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తనయులు ఆదివారం నాడు హాస్పిటల్ కు తీసుకెళ్ళారని.. టెస్టులు అన్ని చేసిన తర్వాత బైపాస్ చేయాలని వైద్యులు సూచించడంతో సోమవారం నాడు సర్జరీకి ఏర్పాట్లు చేశారని సమాచారం. సర్జరీ విషయం తెలిసిన తర్వాత అయన అభిమానులు.. ఫిలిం ఇండస్ట్రీలో అయనతో పనిచేసినవారు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాద్వారా మెసేజులు పెడుతున్నారు.

1985 లో 'అహ నా పెళ్ళంట' సినిమా ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మానందం తెలుగులో వెయ్యికి పైగా సినిమాలలో నటించారు. అత్యధిక చిత్రాలలో నటించినందుకు ఆయన గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. కొత్త తరం కమెడియన్ల హవా పెరగడంతో గత కొన్నేళ్ళుగా ఆయనకు సినిమాలు తగ్గాయి.