Begin typing your search above and press return to search.

పొట్టి ఫ్రాకులో క‌వ్విస్తున్న తెలుగ‌మ్మాయ్

By:  Tupaki Desk   |   3 July 2021 7:30 AM GMT
పొట్టి ఫ్రాకులో  క‌వ్విస్తున్న తెలుగ‌మ్మాయ్
X
వ‌రంగల్ బ్యూటీ ఈషా రెబ్బా సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో సంచ‌ల‌నంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈషా కి ఇన్ స్టా మాధ్య‌మంలో భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. నిరంత‌ర ఫోటోషూట్లు స‌హా వీడియోల‌ను ఈషా షేర్ చేస్తూ భారీ ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది.

తాజాగా ఈషా కొత్త లుక్ యువ‌త‌రంలోకి దూసుకెళ్లింది. ఈషా ఈ లుక్ లో నేచుర‌ల్ అందంతో క‌వ్విస్తోంది. ఆయిలీ టోన్డ్ లుక్ తో ఈషా అంద‌చందాలు యువ‌త‌రానికి క‌నెక్ట‌యిపోతున్నాయ్. ఆ పొట్టి ఫ్రాకులో థై సొగ‌సుల ఎలివేష‌న్.. ఆ కురుల‌లో తురిమిన ఐదురేఖ‌లు పుష్పం.. మోచేతిపై నెమ‌లి పించం ప‌చ్చ‌బొట్టు.. ఇలా హైలైట్స్ ఎన్నో కుర్ర‌కారులో గుబులు రేపుతున్నాయి. మొత్తానికి ఇత‌ర భామ‌ల‌కు ఈషా గ్లామ్ షో ప‌రంగా గ‌ట్టి పోటీనిస్తుండ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

గ‌త కొంత‌కాలంగా ఈషా రెబ్బా టోన్డ్ ఫిట్ బాడీ కోసం జిమ్ యోగా సెష‌న్స్ ని క్ర‌మం త‌ప్ప‌కుండా అటెండ్ అవుతోంది. ఆ క్ర‌మంలోనే జిమ్ నుంచి వ‌ర్కవుట్ల వీడియోలు ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి ఇన్ స్టా వేదిక‌గా వైర‌ల్ అయ్యాయి. తాజాగా పార్క్ ప‌రిస‌రాల్లో ఈషా స్ట‌న్నింగ్ ఫోటోషూట్ అంతే వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుతం ఈషారెబ్బా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` అనే చిత్రంలో న‌టించింది. అలాగే మ‌రిన్ని సినిమాల‌కు క‌మిటైనా లాక్ డౌన్ వ‌ల్ల వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. ఈషా ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది.