Begin typing your search above and press return to search.

టూరిజం ఆదాయం ఉంటేనే సినిమా లొకేష‌న్లు గుర్తొస్తాయా?

By:  Tupaki Desk   |   25 Aug 2020 9:15 AM IST
టూరిజం ఆదాయం ఉంటేనే సినిమా లొకేష‌న్లు గుర్తొస్తాయా?
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక ఇక్క‌డ అభివృద్ధి విష‌య‌మై ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌లు తెర‌పైకొచ్చాయి. దోన‌కొండ‌లో మ‌రో ఫిలింసిటీ నిర్మించాల‌ని.. అలాగే హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి ప‌రిస‌రాల్లో పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ నెల‌కొల్పాల‌ని.. ఫిలిం యానిమేష‌న్ హ‌బ్ ని అందులోకి తేవాల‌ని ర‌క‌ర‌కాలుగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రివ‌ర్యులు త‌ల‌సాని.. ఐటీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. కానీ వీటిలో ఒక్క‌దానికి ఇంకా పునాది రాయి ప‌డిన దాఖ‌లాలేవీ లేవు.

తాజాగా సినీపెద్ద‌ల‌తో భేటీలో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఈ ప్రాంతంలో టూరిజం వృద్ధికి సినిమా ఇండ‌స్ట్రీనే కార‌ణ‌మ‌ని అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రం. అంతేకాదు.. తెలంగాణ వ్యాప్తంగా 50-60 షూటింగ్ లొకేష‌న్ల గురించి ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. చాలా లొకేష‌న్లు టూరిజానికి అనుకూలమ‌ని ఆయ‌న అన్నారు. ఆదిలాబాద్.. వికారాబాద్ జిల్లాల్లో మంచి లొకేష‌న్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. షూటింగుల‌తోనే ప‌ర్యాట‌క ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని ఆయ‌న అన‌డం ఆస‌క్తిక‌రం.

తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని తెలిపారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రణాళిక వచ్చాక సీఎంను కలిసి వివరిస్తామని అన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఆదాయం తెచ్చే టూరిజం గురించేనా.. టాలీవుడ్ డెవ‌ల‌ప్ మెంట్ గురించి నిజాయితీగా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారా లేదా? అన్న‌ది కూడా తేలాల్సి ఉంది.