Begin typing your search above and press return to search.
టికెట్లు కాదు.. షోస్ కూడా లేవ్
By: Tupaki Desk | 9 Jan 2018 3:15 PM ISTపవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి టికెట్స్ కోసం ఫుల్లుగా ట్రై చేసేస్తున్నారా.. అర్ధరాత్రే సినిమా చూసేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారా.. ఇక మీ ట్రయల్స్ అన్నీ ఆపేయచ్చు. మిగిలిన ఏరియాస్ సంగతి కాసేపు పక్కన పెట్టి.. హైద్రాబాద్ వరకు తీసుకుంటే.. ఇక్కడ జనాల్లో మహా ఉత్కంఠ నెలకొంది.
కానీ అందరి హోప్స్ ను పటాపంచలు చేసి పారేసి.. తెలంగాణలో మిడ్ నైట్ షోస్ లేవని తేల్చేసింది గవర్నమెంట్. ఈ మేరకు జీఓ కూడా జారీ చేయగా.. దీని ప్రకారం తేలిందేంటంటే.. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించి.. 8 రోజుల పాటు అంటే ఈ నెల 10 నుంచి 17వరకూ సంక్రాంతి సందర్భంగా ఒక ఎక్స్ ట్రా షో వేసుకునేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా రోజుకు ఏడు షోస్ చొప్పున ప్రదర్శించేందుకు.. మిడ్ నైట్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్స్ వస్తాయన్న హోప్స్ అన్నీ వమ్ము అయిపోయినట్లే.
ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ ఆర్డర్స్ వచ్చేయడంతో.. థియేటర్ల వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పేస్తున్నాయి. మిడ్ నైట్ షోస్ కోసం ఏర్పాటు చేసుకున్న థియేటర్లు.. బెనిఫిట్ షోస్ లేవనే విషయాన్ని అనౌన్స్ చేస్తున్నాయి. జనాల తాకిడి తట్టుకోలేక.. వారికి సమాధానం చెప్పలేక.. కుకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ యాజమాన్యం అయితే.. ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ బెనిఫిట్ షోస్ లేవనే సంగతి చెప్పేస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎవరైనా ఇవాల్టి మిడ్ నైట్ టికెట్స్ కోసం ప్రయత్నిస్తుంటే.. వారు ఇక ఆ ట్రయల్స్ ఆపేసి రిలాక్స్ అయిపోవచ్చు.