Begin typing your search above and press return to search.
టాలీవుడ్ సంక్రాంతి హీరోలు వెయిట్ చేయక తప్పదా..!
By: Tupaki Desk | 12 Jun 2020 2:20 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా పనులన్నీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలలకు పైగా నిలిచిపోయాయి. ఈ సంక్షోభం వలన వేలాది మంది సినీ కార్మికులు చేతిలో పని లేక.. ఆదాయాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 నుండి షూటింగులు చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. ఈ ప్రకటనతో సినీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుండి ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మళ్ళీ ప్రభుత్వం విధించిన నిబంధనల ఆధారంగా ప్రారంభం చేయడానికి సమాయత్తమవుతున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు మాత్రం వెయిటింగ్ చేయక తప్పేలా లేదు.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం షూటింగులు నిలిచిపోయిన సినిమాల వరకే అనుమతి ఇచ్చింది. అంటే మధ్యలో ఆగిపోయిన సినిమాలే తిరిగి మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. కానీ కొత్త సినిమాల షూటింగ్స్ ఇప్పట్లో ప్రారంభించడానికి కాదు. కొత్త సినిమాలకు అనుమతులు రావాలంటే మరో నెల రోజులైనా ఆగకతప్పదు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగు కోసం రెడీ అవుతున్నాడు. అలాగే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' షూటింగుకు రెడీ అయ్యాడు. కానీ ఈ రెండు సినిమాలకు అనుమతి లభించలేదు కాబట్టి ఆగస్ట్ వరకు వెయిట్ చేయక తప్పదు అని సినీవర్గాలు భావిస్తున్నాయి.