Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: తేజ‌స్వీ పాస్ పోర్ట్‌ సైజ్ ఫొటో ఇన్ బ్లాక్

By:  Tupaki Desk   |   18 Sep 2021 2:36 PM GMT
ఫొటో స్టోరీ: తేజ‌స్వీ పాస్ పోర్ట్‌ సైజ్ ఫొటో ఇన్ బ్లాక్
X
కొంత మందికి అందం అభిన‌యం వున్నా దానికి త‌గిన గుర్తింపు ల‌భించ‌దు.. గుర్తించే వాళ్లే వుండ‌రు. ఎంత అందంగా వున్నా ఉప‌యోగం లేక‌పోతే అది నిష్ప్ర‌యోజ‌నం. తెలుగ‌మ్మాయి తేజ‌స్వీ మ‌ది వాడ ప‌రిస్థితీ ఇంతే.. ఎంత అందంగా వున్నా న‌టిగా ఆమెకు గుర్తింపుని తెచ్చే పాత్ర‌లు ఇప్ప‌టికీ ల‌భించ‌లేదు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తేజ‌స్వీని రామ్ గోపాల్‌వ‌ర్మ `ఐస్ క్రీమ్‌` సినిమాతో హీరోయిన్ ని చేశాడు.

చాలావ‌ర‌కు ఈ సినిమాతో తేజ‌స్విని హాట్ హీరోయిన్ గా ప్ర‌మోట్ చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేశాడు వ‌ర్మ కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో ఐస్ క్రీమ్ లో న‌టించినా తేజ‌స్వికి క‌లిసి రాలేదు. ఎంత హాట్ కంటెంట్ తో ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో పెద్ద‌గా వుప‌యోగం లేకుండా పోయింది. బాబు బాగా బిజీ- క‌మిట్‌మెంట్ వంటి చిత్రాల్లో హాట్ హాట్ గా న‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం ఖాళీగా వున్న తేజ‌స్వీ మ‌దివాడ సోష‌ల్ మీడియాలో మాత్రం య‌మ యాక్టీవ్ గా వుంటోంది. తాజ‌.ఆగా ఆమె పోస్ట్ చేసిన బ్లాక్ సారీ ఫొటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. అందాల విందు చేస్తూ బ్లాక్ సారీలో అందాలు ఆర‌బోస్తూ మై పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటూ తేజ‌స్వీ పెట్టిన‌ పోస్ట్ వైర‌ల్ గా మారింది. శ‌ర‌త్ చంద్ర ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ చేసిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. తెలుగ‌మ్మాయ్ ప‌విట కొంగు నిల‌వ‌నంటోంది.. న‌ల్ల కోక కాక‌లు పుట్టిస్తోంది! అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.