Begin typing your search above and press return to search.
ఈ భామకు రోజులెప్పుడు మారతాయో
By: Tupaki Desk | 19 Jun 2016 7:30 AM GMTతేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో మూవీలో ఒక్కసారి, ఇంకొక్కసారి.. అంటూ మహేష్ ని పిలిచే సన్నివేశంతో.. తెలుగు జనాలకు బాగానే నచ్చేసింది ఈ తెలుగమ్మాయి. పెద్ద హీరోయిన్ అయిపోదామని శాయశక్తులా ట్రై చేస్తూంటుంది. వర్మ నుంచి వచ్చిన పిలుపుతో ఆడియన్స్ కు ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చూపించింది. ఇంత చేసినా ఈ భామకు బ్రేక్ మాత్రం రాలేదు.
ఇప్పుడు రోజులు మారాయి అంటూ.. మారుతి స్క్రిప్ట్ తో వస్తున్న ఓ మూవీలో నటిస్తోంది తేజస్వి. ఇది కాకుండా.. చేతిలో ఉన్న ఒకటి అరా సినిమాలన్నీ లో బడ్జెట్ బాపతే. టాప్ హీరోయిన్ అవడమే టార్గెట్ గా.. వేరే ప్రొఫెషన్ ని కూడా వదిలేసి.. రంగంలోకి దిగిన తేజస్వికి.. టాలీవుడ్ లో పెద్దగా కాలం కలిసి రావడం లేదు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నా.. పెద్దగా వర్కవుట్ కావడం లేదు.
ఇటు అందం.. దాన్ని ఎక్స్ పోజ్ చేసే గట్స్ ఉన్నా.. ఇంకా రోజులు మారాలని ఎదురుచూస్తూనే ఉంది తేజస్వి. కొన్ని కేరక్టర్ల సెలక్షన్ విషయంలో ఈ భామ చేసిన తప్పులే.. ఈపరిస్థితికి కారణం అనే వాదన కూడా ఉంది. తను ఆన్ స్క్రీన్ పై కనిపించడం కోసం.. ఒక డైలాగ్ కూడా లేని పాత్రలను ఒప్పుకోవడమే తప్పిదం అంటున్నారు.