Begin typing your search above and press return to search.

చొక్కా బ‌ట‌న్ విప్పితే అప‌చారం అనుకునేరు..!

By:  Tupaki Desk   |   8 Dec 2020 1:25 PM IST
చొక్కా బ‌ట‌న్ విప్పితే అప‌చారం అనుకునేరు..!
X
నాలుగైదేళ్ల క్రితం సోష‌ల్ మీడియాకి ఇంత సినిమా లేదు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ య‌గం రూల్స్ అన్నిటినీ మార్చేస్తోంది. తెలుగ‌మ్మాయి త‌మిళ‌మ్మాయి ముంబై గాళ్ అనే విభేధాన్ని పూర్తిగా చెరిపేస్తోంది. అందాల ఆర‌బోత‌కు హ‌ద్దే లేదు అన్నంత‌గా ఇటీవ‌ల తెలుగ‌మ్మాయిలు చెల‌రేగిపోత‌న్న తీరు చూస్తుంటే ఇంత‌లోనే ఎంత‌టి మార్పు? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంద‌మైన ప‌ద్ధ‌తైన తెల‌గ‌మ్మాయ్ చొక్కా బ‌ట‌న్ విప్పితే అప‌చారం అనుకునే రోజుల నుంచి స‌మాజం ఎంతో ఎత్తుకి ఎదిగింది. ఇదంతా సోష‌ల్ మీడియా స‌మాజంగా ఆవిర్భ‌వించింది.

భార‌తీరాజా.. బాల‌చంద‌ర్.. కె.విశ్వ‌నాథ్ క‌థానాయిక‌ల్ని ఎంత రొమాంటిక్ గా ఆవిష్క‌రించినా వేష‌ధార‌ణ ప‌రంగా అంత హీట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. వ‌లువ‌లు వ‌లిచి పందేరానికి పెట్టేస్తున్నారు.

మారిన ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు మార‌క‌పోతే తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలిచ్చేదెవ‌రు? అందుకే మ‌డిగ‌ట్టుకుని కూచోకుండా ఇలా మారుతున్నారన్న విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. నేటి పోటీ ప్ర‌పంచంలో పోటీప‌డ‌క త‌ప్ప‌దు.. అయినా పోటీప‌డితే త‌ప్పేంటి? అనే ధోర‌ణికి ఇటీవ‌ల తెలుగమ్మాయిలు ఎదిగిన తీరును సునిశితంగా తెలుగు సినీప‌రిశ్ర‌మ ప‌రిశీలిస్తోంది. ఇక ముంబై భామ‌ల‌కు ధీటుగా వేడెక్కించే పాత్ర‌ల్లో ఛాన్సులిస్తే మ‌న గాళ్స్ ఎంత‌మాత్రం త‌గ్గ‌ర‌న్న భ‌రోసార ద‌క్కింది.

తెలుగు నటి తేజస్వి మాదివాడ బిగ్ బాస్ తెలుగుతో పాపుల‌ర‌య్యాక త‌న రేంజు మారిపోయింది. ఇటీవల వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంట‌న్నారు. ఇన్ ‌స్టా లో హీటెక్కించే ఫోటోల‌తో చెల‌రేగడం చూస్తున్న‌దే. లేటెస్టుగా ‘ఐ లవ్ మి’ అని ట్యాగ్ చేస్తూ డెనిమ్ లుక్ ఫోటోని షేర్ చేయ‌గా అది కాస్తా యూత్ లో వైర‌ల్ గా మారింది.

భుజాల నుంచి స్ట్రిప్ చేస్తూ ఆ బ్లూ డెనిమ్ లుక్ సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. తేజస్వి ఇంకా పెద్ద తెరపై పెద్ద స్థాయికి చేరుకోవాలంటే ఇలాంటి గ్లామ‌ర్ ఎలివేష‌న్ డేర్ ఫీట్ త‌ప్ప‌నిస‌రి. తేజ‌స్వి న‌టించిన‌ తాజా చిత్రం `క‌మిట్ మెంట్` ప్ర‌కంప‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల మీటూ వేదిక‌గా లైంగిక వేధింపుల‌పై బ‌హిర్గ‌త‌మైన క‌థానాయిక‌ల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి చ‌ర్చ‌కు తావివ్వ‌నుందో వేచి చూడాలి.