Begin typing your search above and press return to search.

యూట్యూబ్ సెన్సేషన్ గా యంగ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 April 2017 9:12 AM GMT
యూట్యూబ్ సెన్సేషన్ గా యంగ్ హీరోయిన్
X
తెలుగమ్మాయి తేజస్వి మదివాడకు బాగా ధైర్యం ఎక్కువే. ఆమె చేసే సినిమాలే ఇందుకు నిదర్శనం. గ్లామర్ షో చేసేందుకు కూడా సంకోచించని ఈభామ.. మధ్య మధ్యలో చిన్నా చితకా పాత్రల్లో కూడా కనిపించి షాక్ ఇస్తూ ఉంటుంది.

ఇటు సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతూనే ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనానికి సిద్ధమవుతోంది తేజస్వి. ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు చెప్పిందీ తెలుగమ్మాయి. దర్శకురాలు నందినీ రెడ్డి కథ అందించగా.. శశాంక్ యేలేటి డైరెక్షన్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. రాహుల్ రవీంద్రన్.. అదిత్ ఈశ్వరన్ లు కీలక పాత్రల్లో నటంచనున్నారు. విజయవాడ నుంచి హైద్రాబాద్ వచ్చే అమ్మాయిగా తేజస్వి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుండగా.. మెట్రో కల్చర్ ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అన్నదే కథ.

రొమాంటిక్ కామెడీగా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ 25 భాగాలుగా తెరకెక్కుతోంది. 40 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ ను ప్లాన్ చేసి.. చిత్రీకరించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అయితే.. వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా తేజస్వి తీసుకున్న డెసిషన్ సెన్సేషన్ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/