Begin typing your search above and press return to search.

చిన్న తారల చిన్న గ్యాంగ్ భలే ఉందే

By:  Tupaki Desk   |   7 Dec 2017 6:01 PM GMT
చిన్న తారల చిన్న గ్యాంగ్ భలే ఉందే
X
టాలీవుడ్ లో ఈ మధ్య స్క్రీన్ పై తారల రిలేషన్స్ ఎలా ఉన్నా రియల్ లైఫ్ లో మాత్రం చాలా బావుంటున్నాయి. ఆ రిలేషన్ లో ఉన్న వారు ఏ స్థాయిలో ఆనందపడతారో గాని వారిని అభిమానించే వారికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎంచక్కా సెల్ఫీలకు ఫోజిస్తూ కూల్ టాపిక్ అవుతున్నారు. అంతే కాకుండా కలిసి విహార యాత్రలకు కూడా వెళుతున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం అలాంటి ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారని చెప్పాలి. రకుల్ అండ్ రాశి ఖన్నా.. మంచు లక్ష్మీ అండ్ తాప్సి పన్ను.. ఇంకా సమంత అండ్ నీరజా కోన వంటి వారు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. అంతే కాకుండా మరో చిన్న తరాల గ్యాంగ్ కూడా ఉంది. వీరు రీసెంట్ గా గ్యాంగ్ ని స్టార్ట్ చేశారు. తేజస్వి మాధివాడ - అనిషా ఆంబ్రోస్ అండ్ కమెడియన్ గర్ల్ విద్యురామాన్. రీసెంట్ గా ఈ ముగ్గురు అమ్మాయిలు దిగిన ఫొటోస్ సోషల్ మిడియలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇకపోతే ఫొటోలో ఎక్కువగా అందరి చూపు తేజస్వి వైపే వెళుతోంది. అయితే తేజస్వి అండ్ అనిషా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కలిసి తిరుగుతున్నారు. చిన్న చిన్న ట్రిప్స్ కి కూడా వెళుతున్నారు. అలాగే జిమ్ వర్కౌట్స్ కలిసి చేస్తున్నారు.