Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నా.. ప్రమోషన్లు రచ్చే

By:  Tupaki Desk   |   27 Jun 2018 11:20 AM GMT
బిగ్ బాస్ ఇంట్లో ఉన్నా.. ప్రమోషన్లు రచ్చే
X
సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోలో రెండవ సీజన్ మొదలైంది. మొదట్లో అంతంతమాత్రంగానే అనిపించినా, రాను రాను కాంటెస్టెంట్ల మధ్య గొడవలు, నాని హోస్టింగ్ తో షో కాస్త ఆసక్తికరంగా మారింది. కంటెంట్, గ్లామర్, ఎంటర్టైన్మెంట్ అన్ని సమపాళ్లలో పంచిస్తున్న కాంటెస్టెంట్ మాత్రం తేజస్వి మాదవిడ ఒక్కటే అని చెప్పుకోవచ్చు.

ఈ సారి ఏలిమినేషన్ జోన్ లోకి వచ్చిన తనకు వోట్ చేయవలసిందిగా ఆమె ట్విట్టర్ నుండి పోస్టులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదేమిటి సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఫోన్లు - ఇంటర్నెట్ ఇవేం ఉండవు కదా అని ఆశ్చర్యపడకండి. గెలవలన్న పట్టుదలతో షోలో అడుగుపెట్టిన తేజస్వి ప్రోమోషన్ల విషయంలో మిగతా వారితో పోలిస్తే ఒక మెట్టు ఎత్తులోనే ఉంది. ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే ముందే తన ట్విట్టర్ అకౌంట్ ను ఒక ఏజెన్సీ చేతిలో పెట్టి వెళ్ళింది. తేజస్వికి వోట్ వేయమని ప్రేక్షకులను కొరడమే ఆ ఏజెన్సీ పని అన్నమాట. తేజస్వి ఎలిమినేషన్ జోన్ లో ఉంది కాబట్టి వారి పని మొదలైంది.

"గ్రూప్ గా అయినా సింగల్ గా అయినా, అందరిలోనూ ప్రతి దాన్లో తన బెస్ట్ ఇస్తున్న కాంటెస్టెంట్ తేజస్వి. ఆమె వ్యక్తిత్వాన్ని మరింత తెలుసుకోవడం కోసం వోట్ చేయండి" అంటూ ఆ ఏజెన్సీ వారు తేజస్వి ట్విట్టర్ నుండి ట్వీట్లు పెడుతున్నారన్నమాట. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నా, ప్రేక్షకులకు చేరువలో ఉండేందుకు మన ఐస్క్రీమ్ హీరోయిన్ భలే మంచి మార్గాన్నే ఎంచుకుంది కదూ?